ఇలాంటివి మేము నమ్మలేము.. ఎందుకంటే క్రికెటర్లపై ఎప్పుడూ ఇలాంటి తరహా వార్తలు వస్తూనే ఉంటాయి. ఎన్నోసార్లు ఇలాంటి వార్తలను నమ్మి మోసపోయాం అని అంటారా.. ఇప్పుడు మాత్రం ఈ వార్తను నమ్మాల్సిందే.. ఎందుకంటే ఇది ఎవరో చెప్పడం కాదు స్వయంగా రోహిత్ శర్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు. బట్టర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ ఏ డబ్యూట్ ఆఫ్ కైండ్ ట్రైలర్ అవుట్ 4 సెప్టెంబర్ మెగా బ్లాక్ బస్టర్ అంటూ క్యాప్షన్ జత చేశాడు రోహిత్ శర్మ. ఎప్పుడు టీమిండియా జెర్సీ తోనే దర్శనమిచ్చే రోహిత్ శర్మ ఈసారి సినిమా ఎంట్రీ లో భాగంగా చెక్స్ షర్ట్ వేసుకుని ఎంతో కొత్త లుక్ లో దర్శనమిస్తున్నాడు.
బబ్లీ పేస్ తో క్యూట్ లుక్స్ తో అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇక ఇది చూసిన క్రికెట్ అభిమానులు అందరూ కూడా సాధారణంగానే రోహిత్ శర్మ గొప్ప అందగాడు.. ఇక సినిమాలో ఇంకెంత అందంగా కనిపిస్తాడో కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం. ఈ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. సినిమా లో రోహిత్ శర్మ తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా నటిస్తూ ఉండడం విశేషం. ఒక వీరితో పాటు క్యూట్ బ్యూటీ రష్మిక మందన కూడా భాగం అయింది అన్నది తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి