ఇటీవలే ఆసియా కప్లో భాగంగా హాంకాంగ్ పాకిస్తాన్ మధ్య కీలకమైన మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఘన విజయాన్ని అందుకున్న పాకిస్తాన్ సూపర్ 4 లో  అడుగు పెట్టింది. అంతకుముందు భారత్ విజయం సాధించినట్లుగానే అటు పసికూన హాంగ్కాంగ్ పై పాకిస్తాన్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక మ్యాచ్ అనంతరం హాంకాంగ్ ఆటగాళ్లందరూ కూడా  టీమిండియా ఆటగాళ్లను కలిసినట్లుగానే..   పాకిస్థాన్తో మ్యాచ్ ముగిసిన అనంతరం  హాంకాంగ్ ఆటగాళ్లు  పాకిస్థాన్ ఆటగాళ్లను కూడా కలిశారు.


 ఈ క్రమంలోనే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ను  హాంకాంగ్ కెప్టెన్ నిజకత్  కలిశాడు అని చెప్పాలి. ఇద్దరు కూడా కరచాలనం చేసుకొని కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే హాంకాంగ్ కెప్టెన్ నిజకత్  పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ను బ్యాటింగ్ టిప్స్  చెప్పమని అడిగాడు. ఇక ఈ విషయంపై స్పందించిన బాబర్  సమాధానం ఇస్తూ నిన్ను నువ్వు నమ్ము.. బాగా ప్రాక్టీస్ చేయి.. పరుగులు అవే వస్తాయి అంటూ సలహాలు ఇచ్చాడు. ఇందుకు  సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే మ్యాచ్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్  మరోసారి విఫలమయ్యాడు.


 అంతకుముందు భారత్తో జరిగిన మ్యాచ్ లో కూడా కేవలం తక్కువ పరుగులు చేసి నిరాశపరిచిన బాబర్ హాంకాంగ్  జరిగిన మ్యాచ్లో కూడా కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి చివరికి వికెట్ కోల్పోయాడు.   దీంతో ప్రస్తుతం  వీడియో వైరల్ గా మారిపోయిన  నేపథ్యంలో ఇది చూసిన ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు బాబర్ ను  సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్ అయ్యుండి నువ్వే సరిగ్గా ఆడటం  లేదు ఇంకెందుకు పక్క వాళ్ళకి సలహాలు ఇస్తున్నావ్  అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. కాగా గత ఏడాది టి20 ప్రపంచ కప్ ముగిసిన అనంతరం 9 టి20 మ్యాచ్లు ఆడిన బాబర్  190 పరుగులు మాత్రమే చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: