ఇటీవల ఆసియా కప్లో భాగంగా సూపర్ 4లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఆసియా కప్ లో మొదటి మ్యాచ్లో ఓటమి కి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే పాకిస్తాన్ చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరికి పాకిస్థాన్ విజయం సాధించింది అని చెప్పాలి. ఇటీవల పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఓడిపోవడానికి కారణం ఎవరు అంటే ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ ఫాన్స్ అందరు కూడా ఒక్కరి పేరే చెబుతున్నారు.


 అతను ఎవరో కాదు ప్రస్తుతం జట్టులోకి వచ్చి రాణిస్తున్న యువ పేసర్ అర్ష దీప్ సింగ్. 15 బంతుల్లో 31 పరుగులు కావాల్సిన సమయం లో మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా కొనసాగుతున్న తరుణంలో ఎంతో సునాయాసమైన క్యాచ్  జారవిడిచాడు. తద్వారా జట్టు విజయానికి పరోక్షంగా కారణం అయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అర్ష దీప్ సింగ్ చేసిన తప్పే టీమిండియా ఓటమికి కారణమైందని టీమిండియా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నీ వల్లే మ్యాచ్ చేజారింది గల్లీ క్రికెటర్లు  పట్టే క్యాచ్ లు కూడా పట్టలేవా అంటూ సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు.


 ఈ క్రమంలోనే అర్ష దీప్ సింగ్ కు ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రస్తుత క్రికెటర్లు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం అర్ష దీప్ సింగ్ కు మద్దతుగా నిలుస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒత్తిడి ఎక్కువగానే ఉంటుందని. అందుకు నేను కూడా అతీతుడు కాదు అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అర్ష దీప్ సింగ్ జారవిడిచిన క్యాష్ చాలా కీలకమే అయినప్పటికీ ఆటలో ఇలాంటివి సహజం అంటూ తెలిపాడు. అయితే ఈ విషయానికి అతన్ని ఈ రేంజిలో నిందించడం సరికాదు అంటూ చెప్పుకొచ్చాడు. తప్పులను సరిదిద్దుకుని గుణపాఠం నేర్చుకోవాలని సూచించాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: