ఇంగ్లాండ్ టీం లో మూడు ఫార్మాట్ లలోనూ కీలక ఆటగాడిగా పేరు సంపాదించుకున్న అలెక్స్ హేల్స్ వన్ డే వరల్డ్ కప్ 2019 కు ముందు డ్రగ్స్ తీసుకున్నాడన్న విషయంపై టీం నుండి తొలగించారు. అంతటితో హేల్స్ క్రికెర్ట్ కెరీర్ అంతం అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ క్రికెట్ మీద తనకున్న ప్యాషన్ తో ఇంగ్లాండ్ టీం లో ఆడకపోయినా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన టీ 20 లీగ్స్ లో ఆడుతూ తన ఆటకు పదును పెట్టాడు. మాములుగా ఎవరైనా అంతటి ఘటన తర్వాత కోలుకోవడం కష్టమే. కానీ హేల్స్ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా తన ఆటపై దృష్టి పెట్టి పరుగుల వరద పారించాడు.

అయితే ఇప్పటికే అతని వయసు 33 సంవత్సరాలు ఉండడంతో ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ క్రికెట్ యాజమాన్యం ఏ ఫార్మాట్ లోనూ స్థానం కల్పించడానికి ముందుకు రాలేదు. కానీ అతనికి ఇంగ్లాండ్ వేదికగా జరిగిన హండ్రెడ్ టోర్నీ బాగా కలిసి వచ్చింది. ఇందులో ట్రెంట్ రాకెట్స్ తరపున ఓపెనర్ గా బరిలోకి దిగి తన జట్టుకు ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.  ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో హేల్స్ అయిదవ స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఈ ప్రదర్శనే ఇప్పుడు అతని జీవితాన్ని మార్చబోతోంది. ఇంగ్లాండ్ ఈ నెలలో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. అందులో భాగంగా ఏడూ టీ 20 లు మరియు మూడు టెస్ట్ లు ఆడనుంది... దురదృష్టవశాత్తూ జూనీ బెయిర్ స్టో గోల్ఫ్ ఆడుతూ గాయపడడంతో అతని స్థానంలో హేల్స్ ను తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. అంతే కాకుండా వచ్చే  నెలలో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ జట్టు లోనూ హేల్స్ కు చోటు దక్కింది. మూడేళ్ళ క్రితం డ్రగ్స్ తీసుకుని బ్యాన్ అయిన హేల్స్ ఇప్పుడు వరల్డ్ కప్ కు సెలెక్ట్ అవ్వడం మాములు విషయం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: