
ఇక అప్పుడు బౌలౌట్ లో భారత జట్టు విజయం సాధించింది. ఇప్పుడు వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే జరగబోయే టి20 ప్రపంచ కప్ అక్టోబర్ 23 వ తేదీన దాయాదుల సమరం జరగబోతుంది. ఇందుకోసం ఇరు దేశాలు అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ కు నెల రోజుల సమయం ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో ఉన్న మాత్రం రోజురోజుకూ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇకపోతే పాకిస్తాన్ టీమిండియా జట్లకు సంబంధించిన లెజెండరీ క్రికెటర్లు 2007 బౌలౌట్ ఫ్లాష్ బ్యాక్ పేరిట వీడియోను రూపొందించారు.
భారత్ తరపున సునీల్ గవాస్కర్, శివరామకృష్ణన్, వివిఎస్ లక్ష్మణ్ పాల్గొనగా... పాకిస్తాన్ నుంచి రమీజ్ రాజా, షోయబ్ అక్తర్, అమిర్ సోహైల్ పాల్గొన్నారు. అయితే బౌలౌట్ లో తొలిబంతి పాకిస్తాన్ నుంచి రమిజ్ రాజా వేయగా మిస్సయింది. సునీల్ గవాస్కర్ వేస్తే వికెట్లను తాకింది. పాకిస్తాన్ నుంచి అమీర్ సొహైల్ బంతి ఇక గురితప్పింది. భారత్ నుంచి బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ వేస్తే వికెట్లను తాకింది. ఇక దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ వేయగా వికెట్లకు దూరంగా వెళ్ళింది. కానీ శివరామకృష్ణన్ వేస్తే నేరుగా వికెట్లను తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి అప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాను ఓడించలేక పోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.