గత కొంత కాలం నుంచి ఇంగ్లాండ్ జట్టు వరుస వైఫల్యాలతో అభిమానులందరినీ కూడా తీవ్రస్థాయిలో నిరాశపరుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టుపై ఎంతో మంది విమర్శలు కూడా చేస్తూ ఉండటం జరుగుతోంది.  అయితే ఇక ఎన్నో ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఎట్టకేలకు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం టి20 సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు వైఫల్యాలతో ఇబ్బంది పడిన ఇంగ్లాండ్ జట్టు అటు పాకిస్థాన్ గడ్డపై మాత్రం అద్భుతంగా రాణిస్తూ ఉండడం గమనార్హం. సాధారణంగా పాకిస్తాన్ పిచ్లపై అటు ఇతర దేశాలకు సంబంధించిన బాగా రాణించడం  చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.


 కానీ ఇటీవలే మాత్రం పాకిస్థాన్ గడ్డపై ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా రాణించింది అని చెప్పాలి. పాకిస్తాన్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో విజయఢంకా మోగించింది అని చెప్పాలి. ఈ మ్యాచ్లో భాగంగా పాకిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఇక పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు  పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే  అతి కష్టం మీద నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 158 పరుగులు చేశారు. ఈ క్రమంలోనే 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది ఇంగ్లాండ్ జట్టు.


 ఈ క్రమంలోనే ఎక్కడా తొందరపాటుకు లేకుండా ఎంతో ఆచితూచి ఆడుతూ నాలుగు వికెట్ల నష్టానికి 19.2 ఓవర్లలో నే పాకిస్తాన్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఎంతో అలవోకగా చేయగలిగింది అని చెప్పాలి.  అయితే పాకిస్తాన్ బ్యాట్స్మెన్లలో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 68 పరుగులు చేయగా బాబర్ 31 పరుగులు చేశాడు.  ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో అలెక్స్ హేల్స్ 53 పరుగులు చేయగా బ్రూక్స్ 42 పరుగులతో రాణించాడు. ఇక ఈ విజయంతో 1-0 తేడాతో ఆధిక్యం సాధించింది ఇంగ్లండ్ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: