ఇటీవలే ఇంగ్లాండ్ టీమిండియా మహిళలు జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్ డీన్ రన్ అవుట్ కు సంబంధించిన చర్చ ఇంకా ముగియడం లేదు అన్న విషయం తెలిసిందే.. ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరిగిన సమయంలో టీమిండియా స్పిన్నర్ దీప్తి శర్మ ఆస్ట్రేలియా బ్యాటర్ ను రన్ అవుట్ తో దెబ్బ కొట్టింది అని చెప్పాలి. జట్టును గెలుపంచుల వరకు తీసుకువచ్చిన చార్లీ డీన్ ను చివరికి బోల్తా కొట్టించి రన్ అవుట్ చేసింది. ఇది క్రీడ స్ఫూర్తికి విరుద్ధమని కొంతమంది అంటూ ఉంటే రూల్ ప్రకారమే దీప్తి శర్మ రనౌట్ చేసిందని మరి కొంతమంది మద్దతు నిలుస్తున్నారు.


 ఇక ఇటీవల ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. తమ సోషల్ మీడియా ఖాతాలో ఇక మన్కడింగ్ రన్ అవుట్ కి సంబంధించిన ఫోటోని పోస్ట్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ఇదే విషయంపై స్పందించిన దీర్ఘశర్మ రెండు మూడు సార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఆమె తీరు మార్చుకోలేదని అందుకే చివరికి రన్ అవుట్ చేసామని నిబంధనల ప్రకారమే మేము ప్రవర్తించాము అంటూ స్పందించింది. ఇటీవల ఇదే విషయంపై రనౌట్ బాధితురాలు చార్లీ డీన్  తొలిసారిగా స్పందించింది.


ఈ క్రమంలోనే మూడో వన్డే కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ వేసవి ఆసక్తికరంగా ముగిసింది. లార్డ్స్ లో ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా... ఇకనుంచి అయినా నేను క్రీజ్ లోనే ఉండేందుకు ప్రయత్నిస్తా అంటూ రాస్కొచ్చింది. కాగా డీన్ రాసిన పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలీ. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా దీపి శర్మ తన ఓవర్లో మూడో బంతి వేయబోయిన సమయంలో డీన్ నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి చాలా ముందుకు జరగడానికి గ్రహించింది.. దీంతో బంతి విసరడం ఆపి వికెట్లను గిరాటేసింది.  థర్డ్ అంపైర్ కు రిఫర్ చేస్తే చివరికి అవుట్ గా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: