సాధారణంగా టీమిండియా ఏదైనా మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు ఇటీవల కాలంలో క్రికెట్కు దూరమైన మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ఆ మ్యాచ్ కు సంబంధించి విశ్లేషణ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్లు తమ ప్లేయింగ్ ఎలవెన్ జట్టును ప్రకటిస్తూ ఉంటే మరి కొంతమంది మాజీ ఆటగాళ్లు ఇక మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై విశ్లేషణలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి విశ్లేషణల్లో ఎప్పుడూ ముందుంటాడు భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా.


 తన యూట్యూబ్ ఛానల్ వేదికగా భారత్ ఆడే ప్రతి మ్యాచ్ గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలను అన్నింటికీ కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల సౌత్ ఆఫ్రికా తో మొదటి మ్యాచ్ కి ముందు కూడా ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా లాంటి కీలక ఆల్రౌండర్ దూరం కావడం.. ప్రస్తుతం జట్టు బౌలింగ్ విభాగం డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్న నేపథ్యంలో టీమిండియా మొదటి మ్యాచ్ లో తప్పక ఓడిపోతుంది అంటూ అంచనా వేశాడు.


 ఇటీవలే జరిగిన మొదటి మ్యాచ్ చూసిన తర్వాత మాత్రం అటు ఆకాష్ చోప్రా వేసిన అంచనా తప్పు అయింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్ లో భాగంగా ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికా జట్టును చిత్తుగా ఓడించింది. టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేయగా.. లక్ష చేదునకు దిగిన టీమిండియా 16.4 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. దీంతో ఆకాశ చోప్రా విశ్లేషణ పై స్పందిస్తున్న ఎంతోమంది టీమ్ ఇండియా ఫ్యాన్స్ అతను చెప్పింది నిజం కాలేదు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: