భారత్లో క్రికెట్ ఆటకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా క్రికెటర్లను ఆరాధ్య దేవుళ్ళుగా భావిస్తూ ఉంటారు ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా భారత్లో క్రికెట్ క్రికెట్ అంటే చాలు ఎంతో మంది ప్రేక్షకులు పడి చచ్చిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే క్రికెటర్లను అమితంగా అభిమానించే ప్రేక్షకులు ఇక తమ అభిమాన క్రికెటర్లను జీవితంలో ఒక్కసారి కలిసిన చాలు అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సమయం వచ్చింది అంటే చాలు ఎట్టి పరిస్థితుల్లో అభిమాన క్రికెటర్లను కలవడం చేస్తూ ఉంటారు.


 అయితే కరోనా వైరస్ వెలుగులోకి రాకముందు వరకు కూడా ఎంతో మంది అభిమానులు మ్యాచ్ జరుగుతున్న సమయంలో సెక్యూరిటీని దాటుకొని మైదానంలోకి పరుగులు పెడుతూ రావడం.. తమ అభిమాన క్రికెటర్లను కలవడం లాంటివి చేసేవారు. అప్పట్లో ఇలాంటి తరహా ఘటనలు తరచూ వెలుగు లోకి వచ్చాయి అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో కరోనా వైరస్ నిబంధనలను నేపథ్యంలో అటు అభిమానులు సెక్యూరిటీని దాటుకొని రాలేకపోతున్నారు.  ఒకవేళ వచ్చిన ఆటగాళ్లు మాత్రం వైరస్ కారణంగా  అభిమానులను కలవలేక పోతున్నారు. ఇక ఎన్నో రోజుల తర్వాత ఎట్టకేలకు ఇటీవలే మరోసారి ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల సౌత్ ఆఫ్రికా టీమిండియా మధ్య తిరువనంతపురం వేదికగా మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా విజయం సాధించింది. అయితే మ్యాచ్ సమయంలో రోహిత్ శర్మ అభిమాని సాహసం చేశాడు. సెక్యూరిటీని దాటుకుని గ్రౌండ్లో ఉన్న రోహిత్ శర్మ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి అతని కాళ్లు మొక్కాడు.  దీంతో మొదట అతన్ని మొదట వారించిన రోహిత్ శర్మ.. తర్వాత అతనికి సెల్ఫీ ఇచ్చి పంపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: