మరి కొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఇలాంటి సమయంలో టీం ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. జట్టులో కీలక బౌలర్గా కష్టాల్లో ఆదుకునే ప్రేయర్ గా కొనసాగుతున్న ఫేసర్ జస్ప్రిత్ బుమ్రా ఇటీవల గాయం బారినపడి జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న బుమ్రా జట్టులో చేరడంతో మళ్ళీ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే టీమ్ ఇండియాకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.


 వెన్నుముక గాయం బారిన పడి ఇక టి20 వరల్డ్ కప్ మొత్తానికి కూడా దూరం అయ్యాడు అన్నది తెలుస్తుంది. ఇక ఇది టీమిండియా కు ఊహించని పరిణామమే అని చెప్పాలి.  అయితే ప్రస్తుతం జస్ప్రిత్ బూమ్రా లాంటి కీలక బౌలర్ దూరం కావడం టీమిండియా విజయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక బుమ్రా స్థానంలో హైదరాబాద్  ఫేసర్ సిరాజ్ కు జట్టులో అవకాశం దక్కుతుందని టాక్ ప్రస్తుతం వినిపిస్తుంది. మరోవైపు ఇంకో సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలిస్తున్నారట.  అయితే టి20 వరల్డ్ కప్ లో అనుభవం ఉన్న షమీ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.



 అయితే కేవలం టి20 వరల్డ్ కప్ కి మాత్రమే కాదు మరో కీలకమైన సిరీస్ కి కూడా గాయం కారణంగా బుమ్రా దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది  స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ కి కూడా అందుబాటులో ఉండడం అనుమానమేనట. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా ఐసిసి షెడ్యూల్ చేసిన సిరీస్ ఇది.  ఇందులో బుమ్రా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే వెన్నుముక ఫ్రాక్చర్ కు సర్జరీ చేయించుకోవాలని ఉద్దేశంతో ఉన్నాడు బుమ్రా. ఇదే జరిగితే మాత్రం అతనికి కొన్ని నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. తద్వారా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: