టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్లో మాత్రమే కాకుండా విదేశాలలో సైతం విరాట్ కోహ్లీకి వీరాభిమానులు ఉంటారు అని చెప్పాలి.  ఆ రేంజ్ లో తన ఆట తీరుతో అంతర్జాతీయ క్రికెట్లో హవా నడిపిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ప్రపంచ క్రికెట్లో ఏ క్రికెటర్ కి సాధ్యంకాన్ని రీతిలో  ప్రస్తుతం ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు కొలగొట్టిన విరాట్ కోహ్లీ ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి.


 ఇక సోషల్ మీడియాలో కూడా తన పాపులారిటీని అంతకంతకు పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీకి అభిమానులు ఉండడం ఒక ఎత్తైతే భారత దాయాది దేశమైన పాకిస్థాన్లో విరాట్ కోహ్లీకి వీరాభిమానులు ఉండడం మరో ఎత్తు అని చెప్పాలి. ఒకవైపు పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ఆడుతుంటే ఎంతో మంది విరాట్ కోహ్లీ అభిమానులు మాకు విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు కావాలి అంటూ ఫ్లకార్డులు పట్టుకుని స్టేడియంలో ప్రదర్శించడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అన్న విషయం తెలిసిందే. దీంతో భారత్ పాక్ పర్యటనకు వెళ్లడం గాని పాకిస్తాన్ భారత పర్యటనకు రావడం గానీ జరగదు.  ఇక ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పాకిస్తాన్లో ఉండే కోహ్లీ వీరాభిమాని తన ఆరాధ్య క్రికెటర్ కోహ్లీని ఒక ఆసక్తికర కోరిక కోరాడు. రిటైర్ అయ్యే ముందు ఒక్కసారి పాకిస్తాన్లో క్రికెట్ ఆడు కోహ్లీ అంటూ కోరాడు. ఇందుకు సంబంధించిన ఫ్లకార్డుతో కనిపించాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ ఫ్లకార్డు చూసిన తర్వాత కోహ్లీకి అటు పాకిస్తాన్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి ఎంతలా పెరిగిపోతుంది అన్నది అర్థమవుతుంది అంటూ ఎంతోమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: