ఇటీవలే టి20 సిరీస్లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఇక భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా తో వన్డే సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే  అయితే ఇక భారత జట్టులో ఉన్న కీలకమైన ఆటగాళ్లు అందరికీ కూడా వరల్డ్ కప్ నేపథ్యంలో విశ్రాంతి ప్రకటించింది బీసీసీఐ. ఈ క్రమంలోనె శిఖర్ ధావన్ కెప్టెన్సీ లోని ద్వితీయ శ్రేణి జట్టు ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా తో వన్ డే సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే టి20 సిరీస్ లో ఎంతగానో జోరు చూపించిన టీమిండియా అటు వన్డే సిరీస్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నప్పటికీ చివరికి ఓటమితోనే వన్డే సిరీస్ ప్రారంభించింది భారత జట్టు.



 ఇటీవల లక్నో వేదికగా దక్షిణాఫ్రికా తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో 9 పరుగుల తేడాతో ప్రత్యర్ధి సౌత్ ఆఫ్రికా ముందు చివరికి పరాజయం పాలయింది   అయితే ఈ మ్యాచ్ లో వెటరన్  స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. మొత్తంగా మొదటి వన్డే మ్యాచ్లో 8 ఓవర్లు వేసి 39 పరుగుల సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక వెకెట్ కూడా పడగొట్టాడు. ఇక అతని ప్రదర్శన పై ప్రస్తుతం ప్రశంసలు కురిపిస్తున్నారు అందరూ.  అయితే ముఖ్యంగా దక్షిణాఫ్రికా స్టార్ హిట్టర్ మార్కరమ్ ను కుల్దీప్ అవుట్ చేసిన విధానం మాత్రం మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి.


 సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో 16 ఓవర్ వేశాడు కుల్దీప్ యాదవ్. ఈ క్రమంలోనే ఒక అద్భుతమైన బంతితో మార్కరమ్ ను బోల్తా కొట్టించాడు.ఈ క్రమంలోని క్లీన్ బోర్డు చేశాడు అని చెప్పాలి. అయితే మార్కరమ్ బంతిని డిపెండ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ గింగిరాలు తిరుగుతూ వికెట్లను గిరాటేసింది బంతి. ఇందుకు  సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.. అయితే 2019 వన్డే ప్రపంచ కప్ లో కూడా కుల్దీప్ యాదవ్ ఇటువంటి బంతితోనే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ను క్లీన్ బోల్డ్ చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: