క్రీజులో ఎంత సేపు ఉన్నాం అన్నది కాదు ఎంత విధ్వంసం సృష్టించాము అన్నదే ముఖ్యం అన్నట్లుగా హార్దిక్ ఆట తీరు ఉంటుంది అని చెప్పాలి. వైవిద్యమైన బంతులతో బౌలింగ్లో ఆకట్టుకునే హార్దిక్ పాండ్యా ఇక బ్యాటింగ్లో అయితే భారత అభిమానులందరికీ కూడా భరోసా ఇస్తాడు. ఇక కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్న సమయం లో కూడా హార్దిక్ పాండ్యా ఉన్నాడులే అనే భరోసా ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమాని మనసులో ఉంటుంది అని చెప్పాలి. అంతలా తన ఆటతీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇకపోతే ఈనెల 16వ తేదీ నుంచి ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా హార్దిక్ తన ఆటతీరుతో ఆకట్టుకుంటాడు అన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇకపోతే ఐపీఎల్లో హార్దిక్ పాండ్య సహచర ఆటగాడు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరణ్ పోలార్ధం ఆల్రౌండర్ హార్దిక్ పై ప్రశంసలు కురిపించాడు. హార్థిక్ పాండ్యా చాలా తెలివిగా ఆడే క్రికెటర్. అతడి లాంటి ఆటగాళ్లు ఎన్నో సంవత్సరాలకు ఓసారి వస్తారు. గత రెండేళ్లుగా గడ్డుకాలం అనుభవించిన అతని కష్టానికి ప్రతిఫలం చూసాం అంటూ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి