ఇక ఈ ఇటీవల టి20 వరల్డ్ కప్ కు ఎంపిక కాకపోవడం.. కనీసం భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా తో జరగబోయే వన్డే సిరీస్ కి ఎంపిక చేయకపోవడంతో.. భారత సెలక్టర్ ల పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు పృథ్వి షా అన్న విషయం తెలిసిందే. అటు భారత జట్టులో తనను సెలెక్ట్ చేయలేదు అన్న కోపమో.. లేకపోతే తన ఫామ్ మళ్లీ ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలి అన్న కసో తెలుయదు కానీ ఇటీవలే దారుణమైన సెంచరీ చేశాడు పృథ్వి షా.
ఇటీవల ఎలైట్ గ్రూప్ ఏ లో భాగంగా అస్సాంతో జరిగిన మ్యాచ్లో ఇక ముంబై కెప్టెన్గా ఉన్న పృథ్వి షా అదిరిపోయే సెంచరీ సాధించాడు.. 61 బంతుల్లోనే విధ్వంసం సృష్టించి పంతొమ్మిది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 134 పరుగులు సాధించాడు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ 41 బంతుల్లో సెంచరీ చేశాడు. ఫలితంగా ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్ లలో మూడు వికెట్లు నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ చేసింది ఇక ఇందులో 134 పరుగులు ఒక పృథ్వి షావే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే యశస్వి జైస్వాల్ 42 పరుగులతో పృథ్వి షాకు మంచి సహకారం అందించాడు. ఈ క్రమంలోనే పృథ్వి షా సాధించిన మెరుపుసెంచరీ గురించి అందరూ చర్చించుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి