ఇక్కడ ఇలాంటి తరహా వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇంగ్లాండు స్టార్ ఫుట్బాలర్ బకాయో సాకా ఏకంగా ఒక అభిమానిని భయపెట్టినంత పని చేశాడు. సాకా ఫుట్బాల్ బంతిని గోల్ చేయడానికి కొట్టిన వేగానికి బంతి గోల్ పోస్ట్ లోకి కాకుండా పక్కనే ఉన్న బిల్డింగ్ లో బాల్కనీలోకి దూసుకు వెళ్ళింది.. ఈ క్రమంలోనే అక్కడే నిలబడి మ్యాచ్ మొత్తాన్ని ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్న ఒక అభిమాని దాదాపు తల పగిలినంత పని అయింది అని చెప్పాలి. అదృష్టవశాత్తు ఇక బంతి బాల్కనీ కిటికీ తాకి తిరిగి గ్రౌండ్ లోకి పడింది. ఇక బంతి ఒకవేళ అక్కడ ఉన్న అభిమానికి తగిలి ఉంటే మాత్రం ఆ వేగానికి అతని తల పగలడం లేకపోతే మొఖం పచ్చలవ్వడం జరిగేది అన్నది మాత్రం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
అయితే ఒక్కసారిగా బంతి తన ముందు తాకి గ్రౌండ్లోకి వెళ్లిపోవడంతో ఒకసారిగా అతని గుండెలు జారిపోయినంత పని అయింది. ఇక అక్కడ జరిగిన సంఘటన గురించి తెలిసి హమ్మయ్య పెద్ద ప్రమాదం తప్పింది అని అక్కడున్న వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇదంతా యూరోఫా టైటిల్ లీగ్ లో చోటుచేసుకుంది. అయితే మ్యాచ్ విషయానికి వస్తే. అర్సనల్ 1-0 సున్నా తేడాతో గ్లిమ్డ్ పై నెగ్గింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి