ఇకపోతే ఇక భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వరల్డ్ కప్ లో భాగంగా ఈనెల 23వ తేదీన జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ కోసం అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ జట్లు ప్రాక్టీస్ మ్యాచ్లో మునిగి తేలుతూ ఉన్నాయి. ఇకపోతే పాక్, భారత్ మ్యాచ్ కి ఎంత క్రేజ్ ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతూ.. హాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న రాక్ అలియాస్ డ్వెన్ జాన్సన్ టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం ఈ స్టార్ హీరో బ్లాక్ ఆడమ్ సినిమాలో నటించాడు. మరికొన్ని రోజులు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తో ప్రమోషన్స్ కోసం ఒప్పందం చేసుకున్నాడు డ్వెన్ జాన్సన్. ఈ క్రమంలోనే స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై డ్వెన్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలను ఒక వీడియో రూపంలో విడుదల చేసింది. ట్విట్టర్ వేదికగా ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఇద్దరు గొప్ప ప్రత్యర్థులు తలబడుతున్నారంటే ప్రపంచం మొత్తం ఆ ఇద్దరిని చూస్తుంది. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగేది ఒక మ్యాచ్ మాత్రమే కాదు. అంతకుమించి.. ఇట్స్ టైం ఫర్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. డోంట్ మిస్ అంటూ కామెంట్ చేశాడు డ్వెన్ జాన్సన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి