ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడ అని ఎదురుచూసిన దాయాదుల పోరు మరికొన్ని గంటలు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఉత్కంఠ భరితమైన పోరుకు ఆస్ట్రేలియాలోని మేల్ బోర్న్ స్టేడియం సిద్ధమైంది. అయితే సాధారణంగా భారత్,పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు ఎంత ఉత్కంఠ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు. అలాంటిది 90000 మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన  మెల్ బోర్న్  స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతూ ఉండడం ఇక పూర్తిస్థాయిలో స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయే అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారిపోతుంది అన్నది తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే ఇరుజట్లు  కూడా మళ్లీ హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. కాగా ఈ ఏడాది ప్రపంచకప్ లో భాగంగా ఎవరు ఊహించని విధంగా పాకిస్తాన్ చేతిలో పది వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది టీమిండియా. ఈ క్రమంలోనే గత ఏడాది ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. ఇక రోహిత్ శర్మ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తాడు అని అందరూ భావిస్తూ ఉన్నారు. అదే సమయంలో టీమిండియా పై రెండోసారి విజయం సాధించాలని పాకిస్తాన్ ఎదురుచూస్తూ ఉండడం గమనార్హం.


 ఇక టీమ్ ఇండియా విజయంలో ఎవరు కీలక పాత్ర పోషించనున్నారు అనే విషయంపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. కాగా ప్రస్తుతం టీమిండియా కు బ్యాటింగ్ ప్రధాన బలంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్ లోకి రావడం శుభ సూచికం అని చెప్పాలి.. ఓపెనర్లు మంచి శుభారంభం  ఇస్తే ఇక స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ దాన్ని కంటిన్యూ చేయడానికి ఎప్పుడు రెడీ గానే ఉంటాడు. ఇక మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ సృష్టిస్తున్న విధ్వంశాన్ని పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా కొనసాగిస్తాడు అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపులు.. చివరలో దినేష్ కార్తీక్ ఫినిషింగ్  ఇండియాకు ఎంతో కీలకంగా మారబోతుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: