ఇటీవల బీసీసీఐలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. బీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సౌరబ్ గంగూలీ చివరికి అధ్యక్ష పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోసారి అటు బీసీసీఐ అధ్యక్ష పదవిలో సౌరబ్ గంగూలీ కొనసాగుతాడని అందరూ భావించినప్పటికీ.. బీసీసీఐ పెద్దలు మాత్రం మరోసారి బాధ్యతలని అతని చేతిలో పెట్టడానికి ముగ్గు చూపలేదు. అదే సమయంలో ఇక అటు బీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సౌరబ్ గంగూలీ ఐసీసీ చైర్మన్ పోస్ట్ లో కనిపించబోతున్నాడు అన్న వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అన్నది మాత్రం అర్థమైంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే బీసీసీఐ అధ్యక్షుడిగా తప్పుకున్న సౌరబ్ గంగూలీ ఆ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగాను. అంతకుముందు ఒక ఆటగాడిగా కూడా జట్టుకు సేవలు అందించాను. ఇక మొన్నటి వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి చైర్మన్గా  ఉన్నతమైన పదవిలో ఉన్నాను.. అయితే జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు  రానున్న రోజుల్లో మరింత అత్యున్నతమైన  పదవిని చేపడుతాను అంటూ అభిమానులకు మాటిచ్చాడు.


 అయితే బీసీసీఐ కంటే అత్యున్నతమైన పదవి అటు ఐసిసి ప్రెసిడెంట్ కావడం అన్న విషయం తెలిసిందే.  కానీ అది కుదిరే ప్రతిస్థితి లేదు. దీంతో ఇక మళ్ళీ  గంగూలీ బెంగాల్ క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మారతాడు అని అందరూ భావించారు. కానీ ఇటీవల బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రేస్ నుంచి సౌరబ్ గంగూలీ తప్పుకున్నాడు. దీంతో అతని సోదరుడు స్నేహశీస్  క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈనెల 31వ తేదీన జరగబోయే క్యాబ్ సర్వసభ్య సమావేశంలో ఎన్నిక లేకుండానే స్నేహశీష్ ను ఇక కొత్త అధ్యక్షుడిగా నియమించబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఈ విషయం తెలిసి అన్న కోసం దాదా ఎంత త్యాగం చేశాడో అని అనుకుంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: