ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ ముగిసిందో లేదో అంతలోనే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.. ఈ క్రమంలోనే పాకిస్తాన్తో మ్యాచ్లో మంచి ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాను ఇక నెదర్లాండ్స్ తో మ్యాచ్లో కొనసాగించకపోవచ్చు అనే వార్తలు వినిపించాయి. ఎందుకంటే కీలకమైన మ్యాచులు ఉన్న నేపథ్యంలో  ఇక హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది అని అందరూ భావించారు. ఇక హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు గాయాల బారిన పడకుండా ఉండేలా కాపాడుకునేందుకు బీసీసీఐ మేనేజ్మెంట్ అతనికి విశ్రాంతి ఇస్తూ నిర్ణయం తీసుకోబోతున్న వార్తలు గుప్పుమన్నాయి.


 ఇకపోతే ఇక నెదర్లాండ్స్  తో ఈ నెల 27వ తేదీన జరగబోయే మ్యాచ్లో హార్థిక్ పాండ్యా జట్టులో అందుబాటులో ఉండకపోవచ్చు అనే వార్తలపై ఇటీవల భారత బౌలింగ్ కోచ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఇటీవల ఈ విషయంపై స్పందించాడు బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఆడేందుకు ఫిట్ గానే ఉన్నాడని అతడు అన్ని మ్యాచ్లలో కూడా ఆడాలని కోరుకుంటున్నాడని స్పష్టం చేశాడు బౌలింగ్ కోచ్. ఇక పాకిస్తాన్తో మ్యాచ్ ఆడిన ఆటగాళ్లలో ఎవరికి విశ్రాంతి ఇవ్వడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.


 ఇక టోర్నమెంట్లో మరింత ముందుకు వెళ్లే అనుకూలత మాకు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. విడిగా ఆటగాళ్లు అందరూ కూడా ఫామ్ లోకి రావాల్సి ఉంది అంటూ తెలిపాడు. అయితే పాకిస్తాన్ పై కోహ్లీ అపురూప విన్నింగ్ సమయంలో అద్భుతమైన తోడ్పాటు అందించిన హార్దిక్ పాండ్యాను సైతం అభినందించాడు పరాస్ మాంబ్రే. ఇక ఇలా చివర్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో క్రాంప్స్ కారణంగా అటు హార్దిక్ పాండ్యా కాస్త ఇబ్బంది పడుతూ కనిపించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ తో మ్యాచ్లో అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. కానీ ఇది కేవలం పుకార్లు మాత్రమే అన్న విషయం తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: