
ఈ క్రమంలోనే ఇలా మన్ కడింగ్ విషయంలో ఎన్నో మాటలు చెప్పిన హార్దిక్ పాండ్యా ఇటీవలే ఉత్కంఠ భరితంగా జరిగిన పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఎన్నిసార్లు నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉండి క్రీజు దాటాడు అని ప్రశ్న కూడా కొంతమందిలో వచ్చింది. అయితే గతంలో దీప్తిశర్మ వివాదంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిన క్రికెట్ అనలిస్ట్ పీటర్ డెల్లా పెన్నా ఈసారి కూడా తన పరిశీలన శక్తికి పదును పెట్టాడు ఏకంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరు ఎన్నిసార్లు నాన్ స్ట్రైకర్ ఎండ్ లో క్రీజు దాటారు అన్న విషయాన్ని లెక్కలు వేసి మరి చెప్పాడు.
ఇక టీమిండియాలో విరాట్ కోహ్లీ 24% అత్యధిక సార్లు క్రీజు దాటాడట. అలాగే భారత బ్యాటింగ్ సమయంలో మొత్తం 126 డెలివరీలు వేయగా.. ఈ సమయంలో కేవలం 25 సార్లు మాత్రమే భారత బ్యాటర్లు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో క్రీజు దాటారని తేల్చిచెప్పాడు. ఇక పాకిస్తాన్ బ్యాటర్ల విషయానికొస్తే.. ఇఫ్తికర్ అహ్మద్ (94 శాతం), షాన్ మసూద్ (47 శాతం), బాబర్ ఆజమ్ (43 శాతం) చాలాసార్లు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో క్రీజు వదిలి బయటకు వచ్చారట. మొత్తం 16 డెలివరీలకు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఇఫ్తికర్ 15 సార్లు క్రీజు దాటి ముందుకు వచ్చేసినట్లు తెలిపాడు. షాన్ మసూద్ 35 సార్లు క్రీజు దాటేశాడట. మాటలు చెప్పటం కాదు.. రెండు జట్లకు సంబంధించిన స్క్రీన్షాట్లను షేర్ చేసాడు.