టీమిండియాలో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ప్రదర్శన గురించి గత కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. వైస్ కెప్టెన్ గా కొనసాగుతూ స్టార్ బ్యాట్స్మెన్ గా జట్టులో ఉన్న కేఎల్ రాహుల్ ఎంతో బాధ్యతమైన ఇన్నింగ్స్ ఆడాల్సింది పోయి తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. తద్వారా ఇక అతను మొదట్లోనే వికెట్ కోల్పోతూ ఉండడంతో టీమిండియా కష్టాల్లో పడిపోతుంది.


 అయితే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు పరుగులు మాత్రమే చేసి వికెట్ చేజార్చుకున్నాడు కేఎల్ రాహుల్. అయితే పాకిస్తాన్కు కాస్త పటిష్టమైన బౌలింగ్ లైన్ అప్ ఉండడంతో  పోనీలే అని లైట్ తీసుకున్నారు. అయితే ఇటీవల నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో భారీగా పరుగులు చేస్తాడని ఆశించినప్పటికీ మళ్లీ నిరాశే మిగిల్చాడు కేఎల్ రాహుల్. 12 బంతులను ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి చివరికి పెవిలియన్ చేరాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతని టార్గెట్ చేస్తూ ఎంతోమందిని నేటిజెన్లు, మాజీ ఆటగాళ్లు కూడా విమర్శలు చేస్తూ ఉండడం గమనార్ధం.


 ఇక ఇటీవల ఇదే విషయంపై టీం ఇండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా భారత క్రికెట్ లీగ్ లో రాహుల్ నాయకత్వం వహించిన పంజాబ్ జట్టుకు అనిల్ కుంబ్లే  కోచింగ్ బాధ్యతలను నిర్వహించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడూ రాహుల్ లక్నో కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక కుంబ్లే రాహుల్ ఆట గురించి మాట్లాడుతూ.. టీమిండియా తరఫున ఆడటం టి20 లీగ్ లో ఆడటం వేరువేరు అని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ ప్రస్తుతం డైలామా లో ఉన్నాడు. ఫామ్ లేమి పై ఎవరు అతనితో మాట్లాడాల్సిన అవసరం లేదని ఒకసారి టచ్ లోకి వచ్చేస్తే అతడిని ఆపడం కష్ట సాధ్యం అవుతుంది అంటూ అనిల్ కుంబ్లె అతనికి మద్దతుగా నిలిచాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: