అయితే పటిష్టమైన భారత్ చేతిలో ఓడిపోయినప్పటికీ అంతగా ఫీల్ అవ్వని పాకిస్తాన్ అభిమానులు.. పసికూన జింబాబ్వే చేతిలో అతి తక్కువ టార్గెట్ చేదించలేక ఓడిపోవడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోని పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రదర్శన పై.. ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజాంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి. బాబర్ ఒక పనికిరాని కెప్టెన్ అంటూ ఇప్పటికే మాజీ ఆటగాళ్లు ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి అంటూ డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి ఇక ఇటీవలే పాక్ పై విమర్శలు చేస్తున్న వారిలో ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా చేరాడు.
టి20 ప్రపంచ కప్ కు సీనియర్ ఆటగాడు అయినా షోయబ్ మాలిక్ ను ఎంపిక చేయకుండా పక్కకు పెట్టడంపై వసీం అక్రమ్ సీరియస్ అయ్యాడు. పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ దారుణంగా ఉంది అంటూ విమర్శలు గుప్పించాడు. ఒకవేళ తాను కెప్టెన్ గా ఉండి ఉంటే మాత్రం షోయబ్ మాలిక్ తప్పకుండా జట్టులో ఉండేవాడు. ఏడాదికాలంగా సీనియర్ క్రికెటర్లు పదేపదే చెబుతున్న షోయబ్ మాలిక్ లాంటి అనుభవజ్ఞుణ్ణి పాక్ క్రికెట్ బోర్డు ఇంట్లో కూర్చోబెట్టింది. ఇదే సెలెక్ట్లు చేసిన అతిపెద్ద తప్పిదం. ఒకవేళ తాను కెప్టెన్ గా ఉండి ఉంటే నేరుగా చైర్మన్, సెలెక్టర్ల దగ్గరికి వెళ్లి షోయబ్ మాలిక్ ను సెలెక్ట్ చేయాలని అడిగేవాడిని.. చేయకపోతే కెప్టెన్సీ నుంచి తప్పుకునేవాడిని అంటూ వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి