సాధారణంగా టీమ్ ఇండియా లాంటి మేటి జట్టు క్రికెట్ ఆడుతుంది అంటే చాలు ఇక అన్ని విభాగాల్లో కూడా అద్భుత ప్రదర్శనను ఆశిస్తూ ఉంటారు అభిమానులు. అటు టీమిండియా కూడా ఇదే రీతిలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా సంతృప్తి పరుస్తూ ఉంది అని చెప్పాలి. కానీ ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా అటు దక్షిణ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో మాత్రం టీమిండియా ఎందుకో ఫీల్డింగ్ లో తడబాటుకు గురైంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇలా ఫీల్డింగ్లో తడబాటు కారణంగానే ఓటమి చవిచూసింది అన్నా కూడా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అని చెప్పాలి.


 ఎందుకంటే సరైన సమయంలో మంచి ఫీల్డింగ్ ప్రదర్శన కనబరచలేక చివరికి టీమ్ ఇండియా ఎన్నో తప్పిదాలను చేసింది. టీమిండియా చేసిన తప్పిదాలే అటు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ లకు అదృష్టంగా మారిపోయాయి అని చెప్పాలి. ముఖ్యంగా మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్న మార్కరమ్, మిల్లర్ ను అవుట్ చేయడంలో తప్పిదాలు చేసి రెండుసార్లు విఫలమైంది. టీమ్ ఇండియా ఇలా దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో మాత్రం భారత ఆటగాల పేలవమైన ఫీల్డింగ్ కొంపముంచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఎప్పుడు అలర్ట్ గా ఉంటూ మిగతా ఆటగాళ్లు అందరిలో కూడా ఉత్తేజాన్ని నింపాల్సిన రోహిత్ శర్మ మరీ బద్దకంగా కనిపించాడు.



 మిల్లర్ రన్ అవుట్ విషయంలో రోహిత్ శర్మ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్ సమయంలో షమి 13 ఓవర్ వేయగా ఐదో బంతిని మిల్లర్ ఆన్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే సింగల్ కు కాల్ ఇచ్చిన తర్వాత మిల్లర్ పరిగెత్తేలోపే బంతి రోహిత్ శర్మ అందుకున్నాడు. ఆ సమయంలో నాన్ స్ట్రైక్ ఎండలో ఉన్న మిల్లర్ క్రీజు మధ్యలోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ కి మంచి రన్ అవుట్ ఛాన్స్ దొరికింది. కానీ వికెట్లకు దగ్గరగా ఉండి బంతిని త్రోవిసిరిన కూడా అది మిస్సయింది. అయితే నేరుగా పరిగెత్తుకుంటూ వెళ్లి వికెట్లను కొట్టిన రన్ అవుట్ అయ్యేది. అలాంటి బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేశాడు రోహిత్ శర్మ. ఇక కోహ్లీ కూడా మార్కరమ్ ఇచ్చిన క్యాచ్ ను వదిలేసాడు. ఇలా వీరిద్దరూ రెండుసార్లు సేవ్ అయి చివరికి జట్టును గెలిపించుకున్నారు. ఇక రోహిత్ శర్మ బద్ధకాన్ని చూసి ఫ్రాన్స్ సైతం ఆశ్చర్యపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: