ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకు సాగిన మ్యాచ్లో చివరికి భారత జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇలా ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో అటు కేఎల్ రాహుల్ అభిమానులు మాత్రం హమ్మయ్య అనుకుంటూ కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే సాధారణంగా టి20 ఫార్మాట్లో టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ విధ్వంసకర బ్యాట్స్మెన్ అని చెప్పాలి. అతను ఒక మంచి టెక్నికల్ ప్రేయర్ కూడా. అతను బ్యాటింగ్ చేస్తూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. సొగసైన షాట్లతో ఎప్పుడు ప్రేక్షకులను మంత్రముక్తులను చేస్తూ ఉంటాడు.


 అలాంటి కే.ఎల్ రాహుల్ ఈ ఏడాది వరల్డ్ కప్ లో మాత్రం ఇప్పటివరకు పెద్దగా చెప్పుకునే ప్రదర్శన చేయలేదు. ఇక టీమ్ ఇండియా ఆడిన మూడు మ్యాచ్లలో కూడా సింగిల్ డిజిట్ స్కోర్కె పెవిలియన్  చేరాడు. దీంతో కేఎల్ రాహుల్ పేలవమైన ఫామ్ కారణంగా అటు టీమిండియా కష్టాల్లో కూరుకుపోతుందని.. అతని జట్టు నుంచి పక్కన పెట్టాలి అంటూ డిమాండ్లు వచ్చాయి. ఎంతోమంది కేఎల్ రాహుల్ ఆట తీరును ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ విమర్శలు కూడా చేశారు అని చెప్పాలి. ఇలాంటి విమర్శలు నేపథ్యంలో ఇక కేఎల్ రాహుల్ నుంచి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ వస్తే బాగుండు అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూసారు. ఇక ఇలా ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సాధ్యమైంది అని చెప్పాలి.


 ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సిక్సర్లు ఫోర్లతో చదిరేగిపోయి ఏకంగా హాఫ్ సెంచరీ పూర్తి  చేసుకున్నాడు. దీంతో అభిమానులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ. జట్టు నాకంటూ కొన్ని బాధ్యతలు అప్పగించింది. అవి పూర్తి చేసిన నాడు నేను ప్రశాంతంగా నిద్రపోగలను.  ఏడాది నుంచి మేము ప్రపంచ కప్ కోసం ఎదురుచూస్తున్నాము. నా ప్రదర్శన ఎలా ఉన్నా స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించాను. బంగ్లాదేశ్ తో మ్యాచ్ మాకు ఎంతో కీలకం.. ఇక ఒక్కో మ్యాచ్లో ఒక్కొక్కరు జట్టుకు విజయాన్ని అందిస్తున్నారు అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: