ఇకపోతే ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఇక వచ్చే యేడాది ఐపీఎల్ సీజన్ కోసం అటు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే అటు ఫ్రాంచైసీలు కూడా వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ జట్టులోకి మంచి ప్రతిభ ఉన్న ప్లేయర్లను తీసుకొని ఇక టైటిల్ గెలవడమె లక్ష్యంగా బలిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయ్. ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాల్లను వదులుకోవడమే కాదు మరి కొంతమందిని కొనుగోలు చేసేందుకు కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్ అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవల ఏకంగా వరల్డ్ కప్ లో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన ఒక ఆటగాడిపై ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను పడింది అన్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల టీం ఇండియాతో జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లోనే మూడు సిక్సర్లు ఏడు ఫోర్ ల సహాయంతో 60 పరుగులు చేసి ఏకంగా టీమ్ ఇండియా నే వనికించిన బంగ్లాదేశ్ బ్యాటర్ లీటన్ దాస్ అందరి మన్ననలు పొందుతున్నాడు. అయితే అతని దక్కించుకోవడానికి కోల్కతా నైట్ రైడర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే లిటన్ దాస్ పూర్వీకులు అటు బెంగాల్ కు చెందిన వారే కావడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి