రన్ మిషన్ విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఆటగాడి పేరు ప్రస్తావనకు వచ్చింది అంటే చాలు ఇతను సాధించిన రికార్డులు ముందుగా అందరికీ గుర్తుకు వస్తూ ఉంటాయి. అంతేకాదు బౌలర్ల పై ఆదిపత్యం సాధిస్తూ ఇక విధ్వంసకర  బ్యాటింగ్తో చెలరేగిపోయే తీరు అందరికీ కళ్ళ ముందు తేలి ఆడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఒత్తిడిలో మిగతా బ్యాట్స్మెన్లు అందరూ చేతులెత్తేస్తున్న సమయంలో అభిమానులు అందరూ మ్యాచ్ పై ఆశలు వదిలేసుకున్న తరుణంలో విరాట్ కోహ్లీ మాత్రం నేనున్నాను అంటూ మ్యాచ్ నిలబెట్టిన సంఘటనలు ఎంతోమంది ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 ఇలా అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు సాధించిన రికార్డులు ఎన్నో.. ఇక భారత క్రికెట్కు చేసిన సేవలు గురించి అయితే మాటల్లో వర్ణించడం చాలా కష్టమని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో సొగసైన షాట్లను చూస్తూ ఉంటే అటు క్రికెట్ అభిమానులకు రెండు కళ్ళు సరిపోవు. ఇక అతను ఆడే సొగసైన షాట్లకి మాజీ ఆటగాళ్లు సైతం  మంత్రముగ్ధులు అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపై  ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపిల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 విరాట్ కోహ్లీ ఎందుకు తన బ్యాటింగ్ లో ఫ్యాన్సీ షాట్లు ఆడడు అన్న విషయాన్ని కూడా ఇయాన్ చాపెల్ చెప్పుకొచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం విరాట్ కోహ్లీని టీ20 లలో ఎందుకు ఫాన్సీ షాట్లు ఆడకూడదు అని నేను ప్రశ్నించాను. అప్పుడు అతను ఒక ఆసక్తికర సమాధానం చెప్పాడు. నా ఆట తీరు టెస్ట్ ఫార్మాట్ పై ప్రభావం చూపకూడదని అనుకుంటున్నాను. అందుకే ఫ్యాన్సీ షాట్లు ఆడాలని అనుకోవట్లేదు అంటూ విరాట్ కోహ్లీ సమాధానం చెప్పాడు. అందుకే ఇప్పటికి కూడా విరాట్ కోహ్లీ కేవలం సాంప్రదాయమైన షాట్లు ఆడటం ద్వారానే పరుగులు రాబడుతూ ఉంటాడు అంటూ ఇయాన్ చాపెలు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: