ఎన్నో అంచనాల మధ్య ఈసారి వరల్డ్ కప్ గెలిచే విశ్వ విజేతగా నిలిచి.. 15 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతుంది అనుకున్న టీమ్ ఇండియా.. కాస్త 130 కోట్ల భారత క్రికెట్ అభిమానులు అందరినీ కూడా నిరాశలో మునిగి పోయేలా చేసింది అన్న విషయం తెలిసిందే. సూపర్ 12 మ్యాచ్ ల్లో వరసగా విజయా లతో దూసుకు పోయి సెమీ ఫైనల్ లో అడుగు పెట్టిన టీమ్ ఇండియా జట్టు అటు సెమీ ఫైనల్ లో మాత్రం ఒత్తిడి ముందు తలవంచింది అని చెప్పాలి. సెమీ ఫైనల్  లో భాగంగా ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది.


 ఒకవైపు టీమ్ ఇండియా బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి కష్టపడిన అదే మైదానంలో ప్రత్యర్థి బౌలర్లు మాత్రం పరుగుల వరద పారించారు  అని చెప్పాలి. ఇలా బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా పూర్తిగా చేతులెత్తేసింది ప్రత్యర్థి జట్టు.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు టీమ్ ఇండియా పై పది వికెట్ల  తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. దీంతో వరుస విజయాలతో దూసుకు వచ్చిన టీమ్ ఇండియా సెమీఫైనల్ లో తడబడి ఇంటి బాట పట్టింది.


 అయితే అటు టీమ్ ఇండియా ఓడిపోవడాన్ని భారత అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది క్రికెట్ అభిమానులు భిన్నంగా కూడా స్పందిస్తున్నారు. భారత్ ఓడి మంచి పని చేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనతో గెలవడం కష్టమని.. ఇక ఇంగ్లాండ్ పై ఓడిపోయింది కాబట్టి సరిపోయింది. పొరపాటున ఫైనల్ కు వెళ్లి చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి ఉంటే ఆ బాధను తట్టుకోలేకపోయే వాళ్ళం. అందుకే ఇప్పుడే ఓడిపోయి మంచి పని చేసింది అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: