ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైన టి20 వరల్డ్ కప్ దాదాపు గత నెల రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే మేల్ బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ తో టి20 వరల్డ్ కప్ ఎంటర్టైన్మెంట్ ముగిసింది. హోరాహోరీగా సాగిన  ఫైనల్ మ్యాచ్లో చివరికి ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి అటు వరల్డ్ కప్ లో టైటిల్ ఎగరేసుకుపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక టి20 వరల్డ్ కప్ చరిత్రలో రెండవసారి వరల్డ్ కప్ టైటిల్ అందుకున్న జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది.


 జట్టు సమిష్టి కృషితో అటు ఇంగ్లాండ్ జట్టు వరల్డ్ కప్ విజేతగా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంగ్లాండ్ జట్టు వరల్డ్ కప్ విజేతగా నిలవడంతో అటు టీమ్ ఇండియా అభిమానులు కూడా ఎంతో సంతోష పడిపోతున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసి ఇంటిదారి పట్టింది. కానీ పాకిస్తాన్ మాత్రం అనూహ్యంగా ఫైనల్ కు వెళ్లి ఇంగ్లాండ్తో పోటీపడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా పై పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు సెటైర్లు వేశారు. ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా అవమానకరమైన ఓటమి చవిచూసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


 ఇక ఇలా పాకిస్తాన్ మాజీ ఆటగాల్లు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా సంచలనంగా మారిపోయాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ ప్లేయర్ అయిన షోయాబ్ అక్తర్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా బౌలర్ల లాగా పాకిస్తాన్ చేతకాని వారు కాదు మాతో ఫైనల్లో జాగ్రత్త ఇంగ్లాండ్ అంటూ ఒక పోస్ట్ పెట్టగా అది వైరల్ గా మారిపోయింది. ఇకపోతే ఇటీవల ఫైనల్ లో  పాకిస్తాన్ ఓడిపోవడంతో ఇక ఇదే విషయంపై స్పందించిన టీమిండియా బౌలర్  మహమ్మద్ షమి సారీ బ్రదర్.. కర్మ అంటే ఇదే అంటూ కామెంట్ చేస్తూ కౌంటర్ ఇచ్చాడు అని చెప్పాలి.. దీంతో మహమ్మద్ షమీ చేసిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: