క్రికెట్ కెరియర్ లో విధ్వంసకర బ్యాట్స్మెన్ గా అత్యుత్తమ ఆటగాడిగా పేరు సంపాదించిన వారిలో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ముందు వరుసలో ఉంటారు అని చెప్పాలి. ఇక ఇద్దరు ప్లేయర్లు కూడా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్ లో ఎవరికి వారే సాటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడు అద్భుతంగా రాణిస్తూ ఇక జట్టుకు విజయాన్ని అందించడంలో ఈ ఇద్దరు క్రికెటర్లు ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక అలాంటి ఈ స్టార్లకు మొన్నటి వరకు గడ్డుకాలం నడిచింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా విరాట్ కోహ్లీ అయితే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 పేలవమైన ఫామ్ కారణంగా దాదాపు మూడు సంవత్సరాల పాటు శతకానికి దూరంగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఒకప్పుడు మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ ఇక ఒక్క సెంచరీ కోసం ఒక వెయ్యి 21 రోజులపాటు నిరీక్షణ ఎదురుచూడాల్సిన పరిస్థితి  వచ్చింది. చివరికి ఆసియా కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి ఇక నిరీక్షణకు తెర దించుతూ  అభిమానులు అందరిలో సరికొత్త ఊపిరి నింపాడు. అయితే ఇక విరాట్ కోహ్లీ లాగానే అటు డేవిడ్ వార్నర్ సైతం దాదాపు మూడేళ్ల నుంచి సెంచరీకి దూరంగానే ఉన్నాడు. దీంతో అతని అభిమానులు అందరూ కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ మూడేళ్ల సెంచరీ నిరీక్షణకు ఇటీవల తెరపడింది అని చెప్పాలి. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు అటు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడుతుండగా ఇటీవల జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఓపెనర్ గా బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ 102 బంతుల్లో 106 పరుగులు చేశాడు అని చెప్పాలి. అయితే డేవిడ్ వార్నర్ కోహ్లీ లాగానే తిరిగి మళ్ళీ మునిపాటి ఫామ్ సాధించినప్పటికీ మధ్యలో ఉన్న ఈ కాలంలో మాత్రం ఎన్నో అవమానాలు విమర్శలు వ్యక్తిగత దూషణలు ఎదుర్కొన్నాడు. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఇప్పుడు సెంచరీ తో కమ్ బ్యాక్ ఇచ్చి తామేంటో ప్రపంచానికి రుజువు చేశారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: