ఇక చివరి వన్డే మ్యాచ్లో అయితే ఆస్ట్రేలియా జట్టు 221 పరుగుల భారీ తేడాతో విశ్వవిజేత ఇంగ్లాండ్ పై ఘన విజయాన్ని సాధించడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక ఇటీవల జరిగిన మూడో వన్డే మ్యాచ్ మొత్తంలో కూడా అటు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కొట్టిన ఒక సిక్సర్ మాత్రం మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. 48 ఓవర్లో ఏకంగా కళ్ళు చెదిరే సిక్సర్ బాదాడు మిచెల్ మార్ష్.
ఓలీ స్టోన్ వేసిన 48 ఓవర్లో తొలి బంతిని మార్చ్ 115 మీటర్ల భారీ సిక్సర్ గా మలిచాడు. ఇక ఆ షాట్ నేరుగా స్టాండ్స్ లోకి వెళ్లి ల్యాండ్ అయింది అని చెప్పాలి. అయితే ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రికెట్ స్టేడియం అయినా మేల్బోర్న్ మైదానంలో బ్యాట్స్మెన్ సిక్సర్ కొడితే బంతి స్టాండ్స్ లోకి వెళ్ళింది అంటే ఒకవేళ ఇండియాలో అయి ఉంటే మాత్రం ఆ బంతి కచ్చితంగా మైదానం బయటపడేది అని ఎంతో మంది క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ భారీ సిక్సర్ కు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి