క్రికెట్ అనే ప్రొఫెషన్ ఎంచుకున్న ప్రతి ఆటగాడికి కూడా టీమ్ ఇండియా జెర్సీ ధరించాలి అన్నది ఒక కలగా మిగిలిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్లో ఎంతలా అద్భుతమైన ప్రదర్శన చేసిన ఐపీఎల్లో కోట్ల రూపాయలు సంపాదించి ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఇక అటు భారత జట్టులో స్థానం సంపాదించి టీమిండియా జెర్సీ ధరిస్తే మాత్రం ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం అని చెబుతూ ఉంటారు ఎంతోమంది ఆటగాళ్లు. అయితే ఇటీవల కాలంలో మాత్రం టీమిండియాలో ప్రతిభ గల ఎంతో మంది యువ ఆటగాళ్లకు చాన్స్ దక్కుతుంది. ముఖ్యంగా ఆల్రౌండర్లను అయితే కళ్ళకు అద్దుకొని జట్టులోకి తీసుకుంటున్నారు సెలెక్టర్లు.


 ఇకపోతే ఇలా భారత జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న యువ ఆల్ రౌండర్లలో రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యువ ఆల్రౌండర్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విజయ్ హాజరే ట్రోఫీలో అస్సాం జట్టుకు ఆడుతూ ఇక అదరగొడుతున్నారు అని చెప్పాలి. ఇటీవలే తన జీవిత లక్ష్యం ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. టీమిండియా జెర్సీ ధరించడమే తన గోల్ అంటూ తెలిపాడు. దేశీయ క్రికెట్లో రాణిస్తే తప్పకుండా ఉన్నత స్థానానికి చేరుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నా ప్రదర్శన చాలా బాగుంది.


 జాతీయ జట్టులోకి రావాలనేదే ప్రతి క్రికెటర్ లక్ష్యం కూడా. ఇక ఇటీవలే దేశవాళీ టోర్నీలలో మంచి ప్రదర్శన చేస్తూ ఉన్న. ఒకవేళ అస్సాం జట్టు ఫైనల్ కి వెళ్తే ఇక మా జట్టు సభ్యులు కొందరికి భారత ఏ  నుంచి పిలుపు రావడం ఖాయం. ఇప్పటివరకు మా జట్టు అర్హత సాధించలేదు. కాబట్టి ఎవరి పేర్లు రాలేదు. ఈసారి మాత్రం అలా ఉండకూడదు అంటూ రియాన్ పరాగ్ చెప్పుకోవచ్చాడు. కాగా అస్సాం తరుపున విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఆరు మ్యాచ్లలో రెండు శతకాలు ఒక హాఫ్ సెంచరీ సాధించి అదరగొట్టాడు రియాన్ పరాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: