టీ 20 వరల్డ్ కప్ 2022 లో ఘోరమైన ప్రదర్శన చేసి , చిన్న జట్ల చేతిలో కూడా ఓడిపోయి కనీసం లీగ్ స్టేజ్ కూడా దాటకుండా ఇంటిదారి పట్టింది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా రెండు సార్లు టీ 20 వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన వెస్ట్ ఇండీస్ పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. వరల్డ్ కప్ లో ఈ పరాభవం వెస్ట్ ఇండీస్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ మరియు వైట్ బాల్ కెప్టెన్ గా ఉన్న నికోలస్ పూరన్ లపై బలంగా పడింది. వరల్డ్ కప్ నుండి స్వదేశం చేరుకోగానే కోచ్ పదవికి సిమ్మన్స్ రాజీనామా చేశాడు, ఇక రీసెంటుగా నికోలస్ పూరన్ కూడా కెప్టెన్ గా దిగిపోయాడు. ఈ ప్రభావం అతని ఐపీఎల్ పై కూడా ఎఫెక్ట్ చూపించింది.

సన్ రైజర్స్ తో ఆడుతున్న పూరన్ ను మొన్న ప్రకటించిన రిలీజ్ జాబితాలో పేరు చేర్చి అతనికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు రేపు నెలలో జరగబోయే మినీ వేలంలో ఇతను పాల్గొనబోతున్నాడు.. దాని కన్నా ముందు పూరన్ అబుదాబి టీ 10 లీగ్ లో దక్కన్ గ్లాడియేటర్స్ కు సారధిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి వరకు గ్లాడియేటర్స్ నాలుగు మ్యాచ్ లు ఆడగా మూడు మ్యాచ్ లలో గెలిచి టేబుల్ టాపర్ గా నిలిచింది. తన జట్టుకు వరుస విజయాలను అందిస్తూ జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు. ఇప్పటి వరకు పూరన్ నాలుగు మ్యాచ్ లలో 198 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ద సెంచరీలు ఉండడం గమనార్హం.

మాములుగా వన్ డే లలో అర్ద సెంచరీలు చేస్తేనే నిలకడగా ఆడుతున్నాడు అంటారు, ఇక టీ 10 లాంటి పొట్టి లీగ్ లో అర్ధసెంచరీ చేయడం అంటే బ్యాట్స్మన్ విద్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. పూరన్ వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపిస్తున్నాడు. ఇప్పటి వరకు పూరన్ 14 సిక్సులు, 18 ఫోర్లు కొట్టాడు. ఫోర్స్ లో మొదటి స్థానంలో మరియు సిక్సర్స్ లో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంతలా చెలరేగి ఆడుతున్న పూరన్ ను మినీ వేలంలో ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందో చూడాలి.      

మరింత సమాచారం తెలుసుకోండి: