ఇండియాలో దేశవాళీ వన్ డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2022-23 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ రోజు అహ్మదాబాద్ లో కర్ణాటక మరియు సౌరాష్ట్ర జట్ల మధ్యన సెమీఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో సౌరాష్ట్ర 5 వికెట్లు తేడాతో కర్ణాటకకు ఓడించి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. మొదట టాస్ గెలిచిన సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కట్ ఛేజింగ్ కు మొగ్గు చుపాడు. ఆలా మొదట బ్యాటింగ్ కు దిగిన మయాంక్ అగర్వాల్ సారధ్యంలోని కర్ణాటక కీలక మ్యాచ్ లో ఆటగాళ్లు చేతులు ఎత్తేయడంతో కేవలం 171 పరుగులకే ఆల్ అవుట్ అయింది. కెప్టెన్ ముందుండి జట్టును విజయపధంలో నడిపించాల్సింది పోయి ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియం చేరాడు.

ఇక అది మొదలు వికెట్లు వరుసగా కోల్పోయి చివరికి ఆ స్కోర్ తో సరిపెట్టుకుంది. వాస్తవంగా ఇంకా తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యేది, కానీ ఓపెనర్ రవికుమార్ సమర్థ్ నిలకడగా ఆడుతూ జట్టుకు ఒక మంచి స్కోర్ ను అందించడానికి ప్రయత్నించి చివరికి 88 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇతని తర్వాత అత్యధిక పరుగులు చేసిన వారిలో బౌలర్ ఆల్ రౌండర్ మనోజ్ బందగే 22 పరుగులతో నిలిచాడు. అంతర్జాతీయ అనుభవం ఉన్న మనీష్ పాండే కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. సౌరాష్ట్ర బౌలర్లలో కెప్టెన్ ఉనద్కట్ 26 పరుగులు ఇచ్చి 4 వికెట్లు సాధించాడు.

ఛేదనలో సౌరాష్ట్ర ఆరంభంలోనే ఓపెనర్లు డక్ అవుట్ అయినా జయ గోహిల్ (61) , సమర్థ్ వ్యాస్ (33) మరియు  మన్కడ్ (35) లు సమర్థవంతంగా కర్ణాటక బౌలర్లను ఈదుకొని మరో 14 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించి అయిదు వికెట్లతో విజయాన్ని అందుకుని ఫైనల్ కు చేరుకుంది. ఇక మరో సెమీఫైనల్ లో అస్సాం పై మహారాష్ట్ర 12 పరుగులతో  గెలిచి ఊపిరిపీల్చుకుంది. డిసెంబర్ 2 వ తేదీన సౌరాష్ట్ర మరియు మహారాష్ట్ర ల మధ్యన విజయ్ హజారే ట్రోఫీ లో ఫైనల్ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: