ఇటీవల కాలంలో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ అటు టీమిండియాలో మాత్రం అవకాశాలు దక్కించుకోలేక నిరాశలో మునిగిపోతున్న క్రికెటర్లు చాలామంది ఉన్నారు. ఇక అలాంటి వారిలో మొదటి వరుసలో సంజూ శాంసన్ పేరే వినిపిస్తుంది అని చెప్పాలి. సంజు శాంసంగ్ ఎన్నో ఏళ్ల కిందట టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేశాడు. అయితే అతనిలో మంచి టాలెంట్ కూడా ఉంది. కానీ ఇప్పటివరకు అతను దక్కించుకున్న అవకాశాలు మాత్రం అడపాదడపా మాత్రమే అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి అతను అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న ఎందుకో అతన్ని ఎవరు పట్టించుకోవడం లేదు.


 ప్రతి సారి సంజూకి అటు తుది జట్టులో చోటు తగ్గుతుందని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం.. ఇక ఆ తర్వాత తుది జట్టులో సంజు శాంసన్ పేరు లేకపోవడంతో నిరాశపడటం.. గత కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. దీంతో టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో అతనికి అవకాశాలు ఇవ్వడం లేదు. అతని పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారు అంటూ ఎంతోమంది అభిమానులు బీసీసీఐపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు.


 ఇకపోతే ఇటీవల కాలం లో సంజూ శాంసన్ కు మద్దతు పలుకుతున్న అభిమానుల సంఖ్య రోజుకు పెరిగి పోతుంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం బీసీసీఐకి వ్యతిరేకం  గా సంజూ శాంసన్ కు మద్దతుగా సోషల్ మీడియా లో పోస్టులు పెట్టడమే కాదు ఇక బయట కూడా భారీగా కటౌట్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అభిమానులు. ఇటీవలే ఏకం గా కేరళ లోని ఒక కాలేజీ లో అభిమానులు అందరూ కూడా సంజూకు సంబంధించి 40 అడుగుల పెయింటింగ్ ఏర్పాటు చేశారు.  ఇక దానిపై సూపర్ శాంసన్ అంటూ ఒక కామెంట్ కూడా జత చేశారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: