ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు అక్కడ వరుస సిరీస్ లు ఆడుతుంది అని చెప్పాలి  ఈ క్రమం లోనే ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతుంది. ఇకపోతే ఇటీవల వన్డే సిరీస్ లో భాగంగా టీమిండియా మొదటి మ్యాచ్ లోనే ఓటమి చవి చూసింది. బంగ్లాదేశ్ బౌలర్ల దాటికి చేతులెత్తేసిన టీమ్ ఇండియా కేవలం 186 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా ఓటమి ఖాయమని అందరూ భావించారు. ఇలాంటి సమయం లోనే టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అందరి లో కొత్త ఊపిరి నింపారు.


 ఈ క్రమం లోనే ఒకానొక దశ లో టీమిండియా విజయం సాధిస్తుంది అని ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే సవ్యంగా మ్యాచ్ జరిగి ఉంటే టీమ్ ఇండియా గెలిచేది. కానీ టీమిండియా ఆటగాళ్ల పేలవ మైనా ఫీల్డింగ్ తప్పిదాల కారణం గా టీమిండియా ఓటమి పాలు అయ్యింది.  దీంతో గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం తో టీం ఇండియా అభిమానులు అస్సలు జీర్ణించు కోలేక పోతున్నారు. అయితే ఇప్పటికే మొదటి వన్డే మ్యాచ్ లో ఓడిపోయి నిరాశలో ఉన్న టీమ్ ఇండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది.


 ఏకంగా మొదటి వన్డే మ్యాచ్లో చెత్త ఫీల్డింగ్ తో ఓటమిని మూట గట్టుకున్న టీమిండియా కు మరో బ్యాడ్ న్యూస్ అందింది అని చెప్పాలి. మొదటి వన్డే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణం గా భారత ప్లేయర్లకు మ్యాచ్ రిఫరీ రంజన్ మాడుగల ఏకంగా 52.8 లక్షల జరిమానా విధించారు. టార్గెట్ కంటే నాలుగు ఓవర్లు తక్కువగా వేసినందుకు టీమిండియా ఆటగాళ్ల ప్లేయర్ల ఫీజులో 80% జరిమానా విధించారు  ఇక ఈ తప్పును అటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అంగీకరించడంతో చివరికి టీమిండియా ఓటమి నిరాశలోనే జరిమాను కూడా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: