ఇటీవల కాలంలో మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా చచ్చిపోయింది . ఇది ఎవరో చెబుతున్నది కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు సాటి మనిషికి ఏ చిన్న సమస్య వచ్చిన కూడా ముక్కు ముఖం తెలియకపోయినా అయ్యో పాపం అంటూ జాలిపడి సహాయం చేసేందుకు ముందుకు వెళ్లేవాడు మనిషి. కానీ ఇప్పుడు సొంత వారి విషయంలో కూడా ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు అని చెప్పాలి. అంతేకాదు చాక్లెట్ తిన్నంత  ఈజీగా మనిషి ప్రాణాలను తీసేస్తూ ఉన్నాడు సాటి మనిషి.


 దీంతో ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఎవరు ఎప్పుడు ఎటు వైపు నుంచి దాడి చేసి ప్రాణాలను తీసేస్తారో కూడా తెలియని విధంగా మారిపోయింది పరిస్థితి. కాగా ఇటీవల  బెంగళూరులో ఒక దారుణ హత్యకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తుంది అని చెప్పాలి. ఒక వ్యక్తిపై ఏకంగా ఒక గుంపు దాడి చేసి బండరాల్లతో ఇటుకరాల్లతో తల పగలగొట్టి దారుణంగా చంపేసిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. బెంగళూరులోని కెపి ఆగ్రహార ప్రాంతంలో ముగ్గురు పురుషులు ముగ్గురు మహిళలు గుంపుగా ఒకచోట కూర్చుని ఉన్న వ్యక్తి వద్దకు సమూహంగా వచ్చారు.


 ఏదో విషయం పైన అతనితో కాసేపు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఏకంగా అతనిపై దాడికి పాల్పడ్డారు.  ఇంతలో ఒక మహిళా రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని తీసుకొచ్చి అతని తల పగలగొట్టింది. ఇక మరోవైపు ఇంకొంతమంది పురుషులు కూడా పెద్ద బండరాయిని తీసుకువచ్చి అదే పనిగా అతనిపై దాడి చేశారు అని చెప్పాలి. ఎంతో నిర్దాక్షణంగా దారుణంగా హత్య చేసిన ఈ ఘటనను చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అయితే బాధితుడు కేకలు విన్న చుట్టుపక్కల వాళ్ళు అతని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇక చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: