సాధారణంగా పాకిస్తాన్ భారత్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తగ్గిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ జట్లు ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లడం అక్కడ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం చేస్తూ ఉంటాయి  కానీ ఇరు దేశాలు కూడా ఒక దేశ పర్యటనకు మరొక దేశం రావడం అస్సలు జరగదు అని చెప్పాలి. ఏకంగా మెగా టోర్నీలు జరిగినప్పుడు కూడా ఇక ఈ రెండు దేశాలు ఒక దేశ పర్యటనకు మరొకటి వెళ్లడానికి కూడా ఆ దేశాల క్రికెట్ బోర్డులు అస్సలు అంగీకరించవు అన్న విషయం తెలిసిందే.


 వచ్చే ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్ లో వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతున్న నేపథ్యంలో ఇక తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహిస్తేనే తాము ఆసియా కప్ లో పాల్గొంటామని బీసీసీఐ ఇప్పటికే తెలిపింది. ఇక బిసిసిఐ అలా చేస్తే మేము కూడా వరల్డ్ కప్ ఆడబోము అంటూ పాకిస్తాన్ స్పష్టం చేస్తుంది. ఇక ఇలాంటి సమయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా పాకిస్తాన్ ఆటగాళ్లు భారత్ లో పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని చెప్పాలి. భారత్ వేదికగా జరుగుతున్న అంధుల క్రికెట్కు ఇక ఇలాంటి అనుమతులు ఇవ్వడం గమనార్హం. మరికొన్ని రోజుల్లో భారత్ వేదికగా జరగబోతున్న అందుల క్రికెట్ ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు వీలుగా పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లకు ఇక జట్టుకు సంబంధించిన 34 మంది బృందానికి విదేశాంగ శాఖ వీసాలను ఆమోదించింది.  భారత్ తమ ఆటగాళ్ళ వీసాను రద్దు చేసిందని పాకిస్తాన్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం ఇక ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఈనెల 17వ తేదీ నుంచి ప్రపంచకప్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: