మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన టీమ్ ఇండియా జట్టు ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే చివరికి సిరీస్ బంగ్లాదేశ్ కి అప్పగించేసింది. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. సీనియర్ ఆటగాళ్ళతో ఎంతో పటిష్టంగా ఉన్న టీమిండియా ఇలాంటి ప్రదర్శన చేయడమేంటి అంటూ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన పై విమర్శలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇకపోతే ఇటీవల టీమిండియా ఆటగాళ్లు వరుసగా వైఫల్యం చదువుతూ ఉండడంపై ఇక భారత మాజీ కోచ్ మదన్లాల్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ప్లేయర్స్ ప్రదర్శన చూస్తూ ఉంటే అసలు వీళ్ళు టీమిండియా జట్టులోనే ఉన్నారా అని అనుమానం కలుగుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లలో దేశం కోసం ఆడాలన్న మక్కువ మునుపటి జోష్ ఎక్కడ కనిపించడం లేదు అంటూ విమర్శలు చేశాడు మదన్ లాల్. దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆటగాళ్లు రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఐపీఎల్ సమయంలో తీసుకోవాలి.. దేశం తరఫున ఆడటానికిమొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ మదన్ లాల్ సూచించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి