ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ఎన్నో సంచలన ఫలితాలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగాయ్ అనుకున్న జట్లు చివరికి ఓటములతో టోర్ని నుంచి నిష్క్రమించే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఫిఫా వరల్డ్ కప్ లో ఐదు సార్లు ఛాంపియన్గా కొనసాగుతున్న బ్రెజిల్ జట్టు క్రొయేషియా చేతిలో ఓడిపోయి చివరికి టోర్ని నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి. ఇక ఇలా బ్రెజిల్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించటంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు.


 ఇక బ్రెజిల్ జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న నెయ్ మార్ వెక్కివెక్కి ఏడవడం కూడా అభిమానులను మరింత కలిచి వేసింది అని చెప్పాలి. కాగా ఇటీవల  వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదయింది. ఏకంగా మొరాకో చేతిలో పోర్చుగల్  ఓడిపోయింది. చివరికి ప్రస్తుతం 35 ఏళ్ల వయస్సు ఉన్న స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ రోనాల్డో కి ఇది చివరి వరల్డ్ కప్ అనుకుంటున్న సమయంలో పోర్చుగల్ వరల్డ్ కప్ గెలిచి తీరుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక తనజట్టుకు ఒక్కసారైనా వరల్డ్ కప్ అందించాలనే కల నెరవేరకుండానే క్రిస్టియానో రోనాల్డో రిటైర్మెంట్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే రోనాల్డో కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మొరాకో చేతిలో ఓడిపోయి ప్రపంచ కప్ నుంచి పోర్చుగల్ నిష్క్రమించిన తర్వాత తొలిసారిగా ఆ జట్టు కెప్టెన్ క్రిస్టియను రోనాల్డో స్పందించాడు. వరల్డ్ కప్ గెలవాలని తన కల ఈ ఓటమితో చెదిరిపోయింది అంటూ రోనాల్డో వ్యాఖ్యానించాడు. వరల్డ్ కప్ గెలవడం కోసం ఇన్నాళ్లు ఎంతగానో శ్రమించాను. కానీ దురదృష్టవశాత్తు నా కల నెరవేరలేదు.  ఈ టోర్నీ సమయంలో నాపై ఎన్నో వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించడం అనవసరం. మీకు తోచింది రాసుకోండి అంటూ క్రిస్టియానో రోనాల్డో వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: