సాధారణంగా క్రికెట్ అంటేనే ఎంతో ఉత్కంఠతో కూడిన గేమ్ అన్న విషయం తెలిసిందే. అందులోనూ టి20 ఫార్మాట్ అంటే ఇక ఆ గేమ్ లో ఉండే ఉత్కంఠ అంతా ఇంతా కాదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగానే ఉంటుంది. అందుకే టి20 ఫార్మాట్లో ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఇక క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా కన్నార్పకుండా మ్యాచ్ వీక్షించడానికి ఆసక్తి కనబరుస్తూ  ఉంటారు. ఎందుకంటే కన్నార్పితే ఎక్కడ ఆ గ్యాప్ లో ఏదైనా అద్భుతం జరిగిపోతుందేమో అని ఫీల్ అవుతూ ఉంటారు ప్రేక్షకులు.



 ఈ క్రమంలోనే ఉత్కంఠ భరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు ఫన్నీ ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక ఇలాంటివి జరిగినప్పుడు ప్రేక్షకులు కూడా అక్కడ జరిగింది నిజమా అబద్దమా అని కూడా నమ్మలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పాలి. సాధారణంగా వికెట్లకు బంతి తాకి బెయిల్ కింద పడినప్పుడు ఇక ఎంపైర్లు తప్పకుండా వికెట్ ప్రకటించాల్సి ఉంటుంది అని చెప్పాలి. బ్యాట్స్మెన్ వికెట్లను తాకినప్పుడు లేదా కొన్ని కొన్ని సార్లు బ్యాట్ తాకినప్పుడు లేదా బంతి తాకినప్పుడు ఇలా బెయిల్స్ కింద పడటం జరుగుతూ ఉంటుంది.

 కానీ ఇటీవలే మాత్రం ఏకంగా క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడు జరగని ఒక ఆసక్తికర ఘటన జరిగింది. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా బ్రిస్బెండ్ హీట్   మెల్బోర్న్ రెనేగేట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. మేల్ బోర్న్ ఇన్నింగ్స్ లో తొమ్మిదో ఓవర్లో మార్క్ స్టేకేటీ వేసిన ఒక షార్ట్ పిచ్ బంతిని మేడిన్సన్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. అయితే షాట్ క్రమంలో బెయిల్స్ కింద పడిపోయాయి. దీంతో అతను బేయిల్స్ ని కాలితో తాకడం వల్ల బేయిల్స్ కింద పడిపోయాయని భావించి డగౌట్ వైపు వెళ్లడం ప్రారంభించాడు. అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏకంగా అతని కాలు గాని బ్యాట్ గాని ఎక్కడ తగలలేదు. కేవలం గాలికి మాత్రమే బెయిల్స్ ఎగిరిపడ్డాయి అన్న విషయం తర్వాత పెద్ద స్క్రీన్ లో చూసి ఇక ఎంపైర్లు నాటౌట్ గా ప్రకటించారు. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: