ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా మహిళల జట్టు టీమ్ ఇండియా మహిళల జట్టుతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి మెరుగైన ప్రదర్శన చేస్తున్న భారత మహిళల జట్టు స్వదేశీ పరిస్థితులను ఉపయోగించుకొని అటు పటిష్టమైన ఆస్ట్రేలియా తో ఎలా పోరాడుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే భారత్ వచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఏకంగా భారత జట్టు పైన అధిపత్యాన్ని కొనసాగించింది అని చెప్పాలి.


 ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా భారత జట్టుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఏకంగా నాలుగు మ్యాచ్లలో విజయం సాధించింది. ఇక భారత జట్టు స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకోలేకపోయింది. దీంతో కేవలం ఒకే ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇటీవల జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో అయినా భారత మహిళల జట్టు గెలిచి పరువు నిలబెట్టుకుంటుందని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురయింది అన్న విషయం తెలిసిందే.


 చివరి టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా కు పోటీ ఇవ్వలేకపోయినా భారత ఉమెన్స్ టీం 54 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 4-1 తేడాతో ఆస్ట్రేలియా సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి.ఇక చివరి టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా యువ బౌలర్ హీథర్ గ్రాహం అరుదైన రికార్డు సృష్టించింది. ఏకంగా హ్యాట్రిక్ వికెట్లు  తీసింది. 13 ఓవర్లో చివరి రెండు బంతులకు దేవిక వైద్య, రాధా యాదవ్ను అవుట్ చేసిన హీథర్ గ్రాహం.. ఇక 20వ ఓవర్లో తొలి బంతికే రేణుక సింగ్ పెవిలియన్ పంపి హ్యాట్రిక్ కొట్టింది. ఇక అదే ఓవర్లో చివరి బంతికి మరో వికెట్ తీసి మొత్తంగా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: