అయితే ఇలా డబుల్ సెంచరీ చేసింది మన అందరికీ తెలిసిన దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ కాదు ఇప్పుడిప్పుడే క్రికెట్లో ఒక్కో మెట్టు ఎదుగుతున్న మిజోరాం కెప్టెన్ తరువార్ కోహ్లీ. ఇటీవల రంజీ ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో మిజోరాం కెప్టెన్ తరువార్ కోహ్లీ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. మొదట బంతితో రెండు వికెట్లు తీసి మాయ చేసిన కోహ్లీ.. బ్యాటింగ్ లో కూడా డబుల్ సెంచరీ చేసాడు. 297 బంతుల్లో 203 పరుగులు చేశాడు. ఇందులో 34లు ఫోర్లు, ఒక సిక్స్ ఉండడం గమనార్హం. అంతేకాదు తరువార్ కోహ్లీకి సంబంధించిన మరో విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. రంజి క్రికెట్లో ఆడుతున్న యువ ఆటగాడు కోహ్లీ మన అందరికీ తెలిసిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి మంచి మిత్రుడట.
ఇక స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మిజోరాం కెప్టెన్ తరువార్ కోహ్లీ 2008లో భారత్ అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులు అన్న విషయం చాలామందికి తెలియదు. నాటి ప్రపంచ కప్ లో విరాట్‌తో సమానంగా పరుగులు చేసిన తరువార్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత నిలకడలేమి కారణంగా జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు అని చెప్పాలి. ఇలా తన సహచర ఆటగాడి కంటే మెరుగైన ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ క్రికెట్ చరిత్రలో మేటి ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.