నేటితరం క్రికెటర్లలో ఇప్పటికే దిగ్గజ ప్లేయర్గా గుర్తింపు సంపాదించుకున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం స్టార్ క్రికెటర్లకు ఎవరికి అందనంత దూరంలో రికార్డులు సృష్టించి అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ప్రపంచ క్రికెట్లో తన కంటే అత్యుత్తమ ఆటగాడు ఇంకెవరూ లేరు అన్న విషయాన్ని  నిరూపించుకొని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అయితే నేటి తరంలో కోహ్లీ ఈ ఘనత సాధిస్తే ఇక నిన్నటి తరంలో మాత్రం సచిన్ టెండూల్కర్ దిగ్గజంగా కొనసాగాడు.


 ఈ క్రమంలోనే భారత క్రికెట్లో ఎంతోమంది క్రికెట్ నిపుణులు సచిన్ టెండూల్కర్,  కోహ్లీ ఒక తరం వారు కాకపోయినా వీరి ఆటను పోల్చి చూస్తూ ఉంటారు. బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్ దక్షిణాఫ్రికా మాజీ ఫేసర్ అలెన్ డోనాల్డ్ సైతం ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. కోహ్లీకి బౌలింగ్ చేయడం అంటే సచిన్ టెండూల్కర్ బౌలింగ్ చేసినట్లు ఉంటుంది అంటూ పేర్కొన్నాడు. సచిన్కు ఒక్కసారి అవకాశం ఇచ్చామంటే ఇక అతన్ని ఆపడం చాలా కష్టం. ఇక విరాట్ కోహ్లీ కూడా అదే రీతిలో చెలరేగిపోతాడు. అందుకే అతనికి అవకాశం ఇవ్వొద్దంటూ బంగ్లా జట్టుకు సూచించాడు అలెన్ డోనాల్డ్.


 కోహ్లీ ప్రదర్శన మొదటి ఇన్నింగ్స్ లో గొప్పగా లేదు. రెండో ఇన్నింగ్స్ లో కూడా 19 పరుగులు చేశాడు. అయినప్పటికీ కోహ్లీ విషయం లో జాగ్రత్తగా ఉండాలి. కోహ్లీ లాంటి ఆటగాళ్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. వీలైనంత తొందరగా పెవిలియన్ పంపేయాలి. లేదంటే అతని తట్టుకోవడం బౌలర్ల వల్ల అసలు కాదు. ఇక విరాట్ కోహ్లీ స్కోర్ పెరుగుతున్నప్పుడు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకున్న కచ్చితంగా ప్రత్యర్ధులు ఇబ్బందుల్లో పడతారు. ఎందుకంటే కోహ్లీ లాంటి ఆటగాళ్ళు పదేపదే అవకాశాలు ఇవ్వరు అంటూ అంటూ అలెన్ డోనాల్డ్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: