ఈ క్రమంలోనే గత కొంతకాలం గురించి ఇక కేఎల్ రాహుల్ ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. ఇక అతన్ని వెంటనే జట్టు నుంచి పక్కన పెట్టాలి అంటూ ఎంతోమంది మాజీ ఆటగాళ్లు,ఇక భారత క్రికెట్ అభిమానుల సైతం డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే అదే సమయంలో ఇక జట్టులో చోటు సంపాదించుకున్న యువ ఆటగాడు ఇషాన్ కిషన్ మాత్రం వచ్చిన ఒక్క అవకాశం లోనే డబుల్ సెంచరీ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. దీంతో ఇక పేలవమైన ప్రదర్శన చేస్తున్న కేఎల్ రాహుల్ కెరియర్ మరింత అగమ్యగోచరంగా మారిపోయింది అని చెప్పాలి.
ఇలాంటి సమయంలో టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో రాహుల్ అవకాశాల గురించి మాట్లాడాడు సంజయ్ బంగర్. ఇషాన్ కిషన్ ఓపెనర్ గా రాణిస్తున్న తరుణంలో టాప్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ స్థానం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. తుది జట్టులో చోటు కోసం అతను ఇషాన్ కిషన్ పోటీ పడాల్సి ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారమైతే వన్డే ఫార్మాట్లో కే ఎల్ రాహుల్కు ఇక అవకాశాలు రావడం కష్టమే అనిపిస్తుంది అంటూ సంజయ్ బంగర్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రపంచకప్ జట్టులో కూడా అతనికి స్థానం ఉండకపోవచ్చు అంటూ అభిప్రాయపడ్డాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి