ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో ఎక్కువగా వివాదాస్పదంగా మారిపోయిన పేరు ఏదైనా ఉంది అంటే అది మన్కడింగ్ అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎంతోమంది ప్లేయర్లు ఏకంగా మాన్కడింగ్ విధానం ద్వారా రన్ అవుట్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ రూల్ పై అటు ప్రపంచ క్రికెట్లో ఎప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పెట్టిన రూల్ ప్రకారం ఒక బౌలర్ బ్యాట్స్మెన్ ను మన్కడింగ్  విధానంలో రన్ అవుట్ చేయడం అఫీషియల్.


 కానీ ఎవరైనా ఆటగాడు ఇలా మన్కడింగ్ కు పాల్పడ్డాడు అంటే చాలు అతను క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని.. వెంటనే మన్కడింగ్ రూల్ ని అటు ఐసీసీ తొలగించాలి అంటూ ఎంతోమంది  విమర్శలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఇక బ్యాట్స్మెన్ ను హెచ్చరించినప్పటికీ క్రీజుల్లో లేకుండా బయటికి వెళ్ళినప్పుడు.. ఇక ఇలా మన్కడింగ్ చేయడం మంచిదే అంటూ మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అంతర్జాతీయ మ్యాచ్ లలో ఎవరైనా ప్లేయర్ మన్కడింగ్ కు పాల్పడ్డాడు అంటే చాలు అతని పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతూ ఉంటుంది అని చెప్పాలి.


 ఇలా ప్రపంచ క్రికెట్లో అత్యంత వివాదాస్పదంగా మారి పోయింది మన్కడింగ్. అయితే ఇదే విషయం పై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విను మన్కడ్ మనవడు హర్ష మన్కడ్. ఆ పదం వాడటంలో తమకు అభ్యంతరం ఏం లేదని.. ఆ పదాన్ని కొనసాగించడం ద్వారా విను మన్కడ్ జ్ఞాపకాలు బతికే ఉంటాయి అంటూ హర్ష మన్కడ్ చెప్పుకొచ్చాడు. 1947లో ఆస్ట్రేలియా క్రికెటర్ బిల్ బ్రౌన్ ను విను మన్కడ్ ముందుగా హెచ్చరించిన తర్వాతే.. రన్ అవుట్ చేశాడని అందులో తప్పేమీ లేదు అంటూ అతను వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: