కొత్త ఏడాదిలో భాగంగా టీమ్ ఇండియా తమ ప్రస్థానాన్ని టి20 సిరీస్తో ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. అది కూడా ఇక స్వదేశంలోనే ఈ టి20 సిరీస్ జరుగుతూ ఉండడం గమనార్హం. భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో టి20 సిరీస్ ఆడుతున్న టీమ్ ఇండియా.. ఇది ముగిసిన వెంటనే వన్డే సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే టి20 సిరీస్ లో భాగంగా ఇప్పటికీ రెండు మ్యాచ్లు ముగిసాయి. సీనియర్ ప్లేయర్లు ఎవరు కూడా ప్రస్తుతం జట్టుకు అందుబాటులో లేని నేపద్యంలో పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా జట్టు శ్రీలంకతో తలబడుతుంది. ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.


ఇదిలా ఉంటే.. ఇక ఈ టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో రెండు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే రెండో టి20 మ్యాచ్ లో మాత్రం భారత బౌలింగ్ విభాగం చేతులేత్తేయడం.. ఇక బ్యాటింగ్ విభాగం పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడంతో చివరి వరకు పోరాడినప్పటికీ 16 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా ఇరుజట్లు చేరో మ్యాచ్ గెలవడంతో 1-1 తో సిరీస్ సమంగా కొనసాగుతుంది. కాగా నేడు మూడో టి20 మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే..


 ఈ క్రమంలోనే సిరీస్లో విజయం సాధించాలంటే మాత్రం ఇక నేడు జరగబోయే మూడో టి20 టీమిండియా తో పాటు శ్రీలంక కూడా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పాలి. ఇలా మూడో టి20 మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్ గా మారిపోయింది. రాజ్కోట్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది అని చెప్పాలి. ఇప్పుడు వరకు జరిగిన మ్యాచ్లో టీం ఇండియా నిలకడలేమిటో ఇబ్బంది పడితే.. లంక మాత్రం బౌలింగ్ బ్యాటింగ్లో సత్తా చాటుతుంది. మరి నేడు కీలకమైన మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: