ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో టాప్ క్లాస్ జట్టుగా కొనసాగుతున్న టీమిండియా ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో చేసిన ప్రదర్శన మాత్రం తీవ్ర విమర్శలకు దారి తీసింది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు ఫీల్డింగులో కీలకమైన క్యాచ్లను వదిలేయడమే కాదు మరోవైపు బౌలింగ్లో కూడా తేలిపోయింది. ఇంకోవైపు బ్యాటింగ్లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది టీమిండియా అని చెప్పాలి. ముఖ్యంగా ఎప్పుడు టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించే యువ బౌలర్ అర్షదీప్ సింగ్ అయితే తన బౌలింగ్తో అందరికీ చిరాకు తెప్పించాడు.
ఏకంగా ఓకే ఓవర్లో చివరి బంతిని కంప్లీట్ చేసేందుకు హ్యాట్రిక్ నో బాల్స్ వేసిన అర్షదీప్ సింగ్ ఇక కీలకమైన 19వ ఓవర్లో కూడా మరో రెండు నోబాల్స్ వేసి నిరాశపరిచాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏకంగా ఐదు నోబాల్స్ వేయడం పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. కాగా అతనిపై ఒక కార్టూన్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ గా మారిపోయింది. బౌలింగ్ లైన్ దాటితే కొండపై నుంచి కింద పడిపోయే పీచ్ పై అతడిని ప్రాక్టీస్ చేయించాలని అప్పుడే అర్షదీప్ మరోసారి నోబాల్స్ వేయడని ఆ కార్టూన్ లో అర్థం ఉంది. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ అర్షదీప్ కు ఇదే కరెక్ట్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి