
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడు అని.. ఏకంగా తన తోటి టీమ్ మేట్ గర్ల్ ఫ్రెండ్ తో న్యూడ్ వీడియో కాల్ కూడా మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయ్యాడు అంటూ ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్ లు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం మరింత సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా బాబర్ సహచర ఆటగాడు ఇక జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు తన గర్ల్ ఫ్రెండ్తో బాబర్ కు ఎర వేశాడు అంటూ ఎంతో మంది చర్చించుకున్నారు.
బాబర్ అజాం ఈ విషయంపై స్పందించాడు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఉద్దేశిస్తూ సుఖంగా ఉండేందుకు మరి అంత రిస్క్ చేయనన్న అర్థం వచ్చేలా ఒక ట్విట్ చేశాడు అని చెప్పాలి. అంతేకాదు తనపై వస్తున్న ఆరోపణలకి ఇక పరోక్షంగా చెక్ పెట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నది తీరాన ఆహ్లాదమైన వాతావరణంలో సేద తీరుతున్న ఫోటోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు బాబర్. ఈ ఫోటోలో నవ్వుతూ కనిపించాడు అని చెప్పాలి. దీంతో ఇక తనపై వస్తున్న ఆరోపణలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చెప్పకనే చెప్పాడు .