
కానీ ఊహించని రీతిలో అటు న్యూజిలాండ్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 99 పరుగుల స్వల్ప టార్గెట్ ఛేదించడానికి టీమిండియా చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే న్యూజిలాండ్తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ రన్ అవుట్ ఎంత చర్చనీయాంశంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా కొంతమంది వాషింగ్టన్ సుందర్ అభిమానులు అయితే సూర్య కుమార్ కావాలనే వాషింగ్టన్ సుందర్ ను రన్ అవుట్ అయ్యేలా చేశాడు అంటూ విమర్శలు గుప్పించడం కూడా చేశారు అని చెప్పాలి.
ఇక ఇటీవలే ఈ విషయంపై సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాషింగ్టన్ సుందర్ రన్ అవుట్ కు తానే కారణం అంటూ సూర్య కుమార్ యాదవ్ ఒప్పుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ రన్ అవుట్ విషయంలో మొత్తం తప్పు నాదే. బంతి ఎటు వెళ్లిందో నేను గమనించలేదు. నేను కొట్టిన ఆ షాట్ కి కచ్చితంగా పరుగు రాదు. కానీ పరుగుకు ప్రయత్నించి చివరికి అటు వాషింగ్టన్ సుందరు రన్ అవుట్ అయ్యే పరిస్థితిని తీసుకువచ్చాను అంటూ తన తప్పును అంగీకరించాడు సూర్య కుమార్ యాదవ్. అయితే సాధారణంగా ఏ బ్యాట్స్మెన్ కూడా ఇలా తన తప్పును ఒప్పుకోడు. కానీ సూర్యకుమార్ తనదే తప్పు అంటూ ఒప్పుకోవడంతో ప్రస్తుతం సుందర్ అభిమానుల సైతం అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.