ఇండియా మరియు న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న వన్ డే సిరీస్ మరియు పొట్టి ఫార్మాట్ లకు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. గత రెండు వారాలుగా జరుగుతున్న ఈ సిరీస్ లో వన్ డే లలో ఇండియా కివీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ లోనే ఓపెనర్ బ్యాట్స్మన్ శుబ్మాన్ గిల్ డబల్ సెంచరీ తో అదరగొట్టాడు. ఇక రోహిత్ శర్మ , కోహ్లీ లు సెంచరీలతో ఇండియా విజయాలలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఏంటో కసితో టీ 20 సిరీస్ ను స్టార్ట్ చేసిన కివీస్ కు మొదటి మ్యాచ్ లోనూ పరాభవం తప్పలేదు. ఇక మొన్ననే ముగిసిన రెండవ మ్యాచ్ ను మరిచిపోవడం ఎవరు సాధ్యం కాదు అని చెప్పాలి.

ఈ పిచ్ ను ఎలా తయారుచేశారు తెలియదు కానీ పరుగులు రావడానికి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఎంతలా ఇబ్బంది పడ్డారంటే... చూస్తేనే తెలుస్తుంది. ఇండియాలో టీ 20 లకు ఇలాంటి పిచ్ లు తయారుచేయడం ఇదే మొదటిసారి కాబోలు. చివరికి ఇండియా చివరి రెండు బంతులతో ఒకదానికి విజయాన్ని అందుకుంది. లేదంటే ఇండియా ఓటమి తప్పేది కాదు. దానితో మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ కాస్తా సమంగా ఉంది. రేపు సాయంత్రం అహమ్మదాబాద్ వేదికగా మూడవ మ్యాచ్ మరియు నిర్ణయాత్మక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిని వరించనుంది అంటే ఖచ్చితంగా రేపే తెలుస్తుంది. కానీ ఛేజింగ్ తీసుకున్న జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పగలం.

ఇక ఈ రెండు మ్యాచ్ లలో ప్రదర్శన బట్టి చూస్తే రేపటి మ్యాచ్ లో కివీస్ కు గెలుపు అవకాశాలు ఉంటాయి. ఇండియా ఆటగాళ్లకన్నా కివీస్ ఆటగాళ్లు బ్యాటింగ్ లో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. బౌలింగ్ లో మన వైపు స్పిన్ దుర్బేధ్యంగా ఉంది. గత మ్యాచ్ లో స్పిన్నర్లు చాహల్ , కుల్దీప్ , హూడా మరియు వాషింగ్టన్ సుందర్ లు కివీస్ ను ఎంతలా భయపెట్టారో చూశాము. మరి చూద్దాం రేపు ఎవరు ఛేజింగ్ తీసుకుంటారు ... అన్న విషయం తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: